Sunday, November 16, 2025
HomeఆటICC ODI Rankings: హిట్ మ్యాన్ కు అగ్రస్థానం.. టాప్-10లో నలుగురు మనోళ్లే..

ICC ODI Rankings: హిట్ మ్యాన్ కు అగ్రస్థానం.. టాప్-10లో నలుగురు మనోళ్లే..

ICC ODI rankings Update: ఐసీసీ బుధవారం పురుషుల వన్డే ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. ఈ జాబితా లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక స్థానం ఎగబాకి ఐదో ర్యాంక్ ను దక్కించుకున్నాడు. భారత కెప్టెన్ శుభమన్ గిల్ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టాప్-10 ర్యాంకింగ్స్ లో నలుగురు టీమ్ ఇండియా ప్లేయర్లు ఉండటం విశేషం.

- Advertisement -

టాప్-10లో నలుగురు మనోళ్లే..
తాజా ర్యాంకింగ్స్ లో రోహిత్ 781 రేటింగ్ పాయింట్లతో నంబర్ 1 ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో రోహిత్ ఓ భారీ సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ సాధించడంతో తన ర్యాంక్ ను నిలబెట్టుకోగలిగాడు. అప్ఘాన్ ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్ 764 పాయింట్లతో రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు. కివీస్ ఆటగాడు డారిల్ మిచెల్ తన మూడో ర్యాంకును కాపాడుకున్నాడు. నాలుగు, ఐదు ర్యాంకుల్లో గిల్, కోహ్లీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరో టీమ్ ఇండియా ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ 9వ ర్యాంకులో నిలిచాడు.

దిగజారిన బాబర్ ర్యాంక్..
శ్రీలంక బ్యాటర్ చరిత అసలంక ఆరో స్థానంలో నిలిచాడు. పాక్ ప్లేయర్ బాబర్ అజామ్ 709 పాయింట్లతో రెండు స్థానాలు పడిపోయి ఏడవ ర్యాంకుకు చేరుకున్నాడు. అతడు 2019 తర్వాత టాప్-5 ఫ్లేస్ ను కోల్పోవడం ఇదే తొలిసారి. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు ఇన్నింగ్స్‌లలో 169 పరుగులు చేయడం ద్వారా పాక్ ఫ్లేయర్ సైమ్ అయూబ్ 18 స్థానాలు ఎగబాకి 269 రేటింగ్ పాయింట్లతో 35వ స్థానానికి చేరుకున్నాడు. సల్మాన్ ఆఘా 14 స్థానాలు ఎగబాకి 16వ ర్యాంకుకు ఎగబాకాడు. సౌతాఫ్రికా బ్యాటర్ డికాక్ 15వ స్థానానికి ఎదిగాడు.

Also Read: Nitish Kumar Reddy – జట్టులో తెలుగబ్బాయ్‌ కి నో ఛాన్స్‌

సత్తా చాటిన కుల్దీప్..
ఇక వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్ లో అప్ఘాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ 710 పాయింట్లతో నంబర్ 1 ర్యాంకును దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ రెండో స్థానానికి ఎగబాకాడు. సౌతాఫ్రికా బౌలర్ కేశ్ మహారాజ్ మూడో ర్యాంకును నిలబెట్టుకున్నాడు. శ్రీలంక బౌలర్ మహీశ్ తీక్షణ నాలుగో ర్యాంకులో, నమీబియా బౌలర్ బెర్నార్డ్ ఐదో స్థానంలో నిలిచారు. టీమ్ ఇండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆరో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆల్ రౌండర్స్ జాబితాలో అఫ్గాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్‌జాయ్ టాప్ ర్యాంక్ దక్కించుకున్నాడు. అక్షర్ పటేల్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad