సచిన్ టెండూల్కర్ మంచి ఫుడ్డీ అంతే కాదు ఓవైపు క్రికెట్ ఇంకోవైపు హోటల్ బిజినెస్ మరోవైపు ఇంట్లో వంటలు చేయటంతోపాటు ఆయన ఇంట్లోనే పంటలు పండిస్తారు. తన ఇంట్లో, పెరట్లో, టెర్రస్ పైన ఆయన రకరకాల పళ్లు, పూలు, కూరగాయలు పండిస్తూ ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తున్నారు. కెమికల్ ఫ్రీ అయిన ఆర్గానిక్ పంటలంటే టెండ్ల్యాకు చాలా ఇష్టం.
క్యాప్సికం, జ్యుచిని, శెనగలు, పాలకూర వంటి ఆకుకూరలు, బెండకాయ, వంకాయ..ఇలా చాలా రకాల పంటలు ఇంట్లోనే పండించేస్తున్నారు. సచిన్ అర్బన్ గార్డెన్ చూసి అందరూ వారెవ్వా అనుకుంటున్నారు. రోజూ ఈ మొక్కలకు నీళ్లు పోయటం, కొత్తవి నాటడం, కలుపు తీయటం, పంట కోయటం వంటి పనులను సచిన్ ఫుల్ గా ఎంజాయ్ చేసేస్తున్నారు.
సచిన్ ఈమధ్యనే తన ఇన్స్టాలోనూ గార్డెనింగ్ ప్యాషన్ పై ఈ విషయాలన్నీ అనౌన్స్ చేశారు. నాకు దేనికీ టైం లేదు..ఫుల్ బిజీ.. ప్యాషన్స్ కు టైమే దొరకట్లేదు అనేవారంతా మాస్టర్ బ్లాస్టర్ ను రోల్ మోడల్ గా తీసుకోవాలి.