అండర్-19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్(U-19 World Cup)ఫైనల్‌లో భారత బౌలర్లు విజృంభించారు. దీంతో సౌతాఫ్రికా కేవలం 82 పరుగులకు ఆలౌట్ అయింది. ముఖ్యంగా తెలుగు అమ్మాయి గొంగడి త్రిష అదరగొట్టింది. కీలకమైన 3 వికెట్లు తీసి సత్తా చాటింది. ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ, పరుణిక చెరో రెండు వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో వాన్ వస్ట్ 23 పరుగులు, బోథ 16 పరుగులు చేశారు. నలుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. 83 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగనున్న భారత్.. దూకుడుగా ఆడుతోంది. దీంతో మరికాసేపట్లో విశ్వవిజేతగా నిలవనుంది.