Virat Kohli| ఐదు టెస్టుల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ఆటగాళ్లు ఆ దేశ ప్రధాని ఆంథోని ఆల్బనీస్‌ను కలిశారు. ఈ సందర్భంగా భారత ఆటగాళ్లతో ప్రధాని కరచాలనం చేస్తూ ఫొటోలు దిగుతూ సందడి చేశారు. ఈ క్రమంలో ప్రధాని ఆల్బనీస్ – విరాట్ కోహ్లీ(Anthony Albanese – Virat Kohli) మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఆల్బనీస్ మాట్లాడుతూ పెర్త్‌లో అద్భుతం జరిగింది.. ఆ సమయంలో మా ఆటగాళ్లు తడబడుతుంటే.. మీరు సెంచరీ కొట్టి మరింత బాధపెట్టారు అని వ్యాఖ్యానించారు. దీనికి కోహ్లీ కూడా స్పందిస్తూ ఆ మాత్రం మసాలా జోడించకపోతే మజా ఏం ఉంటుందని కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు ముందు భారత జట్టు ప్రైమ్ మినిస్టర్స్ XI జట్టుతో శనివారం నుంచి రెండు రోజుల వార్మప్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఆడేందుకు టీమిండియా ప్లేయర్లు కాన్‌బెర్రా చేరుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడి పార్లమెంట్ హౌస్‌లో ప్రధాని ఆల్బనీస్‌తో భేటీ అయ్యారు. తొలి టెస్టులో భారత జట్టు ఆస్ట్రేలియా జట్టుపై 295 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించిన సంగతి తెలిసిందే.