Monday, November 17, 2025
HomeTop StoriesVirat Kohli: ఫీల్డింగ్‌లో కింగ్‌ స్టైలే వేరు.. సూపర్‌ క్యాచ్‌తో అదరగొట్టిన కోహ్లీ.. వీడియో

Virat Kohli: ఫీల్డింగ్‌లో కింగ్‌ స్టైలే వేరు.. సూపర్‌ క్యాచ్‌తో అదరగొట్టిన కోహ్లీ.. వీడియో

Virat Kohli Super Catch In Ind Vs Aus ODI 3: అటు బ్యాటింగ్‌లోనే కాదు.. ఇటు ఫీల్డింగ్‌లోనూ భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఎప్పుడూ కింగే.. ఇక అప్పుడప్పుడూ ఫీల్డింగ్‌ చేసి వికెట్‌ తీసిన చరిత్ర కూడా కోహ్లీ సొంతం. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో అద్భుతమైన క్యాచ్ పట్టి ప్రేక్షకులను అబ్బురపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/viral/kabali-elephant-blocks-highway-for-18-hours/

సిడ్నీలో జరుగుతున్న మూడో వన్డేలో మొదటగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు 236 పరుగులు చేసింది. ఇంకా 3 ఓవర్లు ఉండగానే ఆలౌట్‌ అయింది. ఈ క్రమంలో 22వ ఓవర్‌లో విరాట్‌ పట్టిన క్యాచ్‌ అభిమానులను ఫుల్‌ ఖుష్‌ చేసింది. బుల్లెట్‌ వేగంతో తనవైపు వస్తున్న బాల్‌ను కోహ్లీ అత్యంత సునాయాసంగా పట్టుకున్నాడు. ఇది కోహ్లీ ఫిట్‌నెస్‌, స్పాంటేనియస్‌కి చిన్న ఉదాహరణ మాత్రమే.. 

22.3 వ ఓవర్‌ వద్ద క్రీజ్‌లో ఉన్న మాథ్యూ షార్ట్.. వాషింగ్టన్ సుందర్ వేసిన బంతిని స్క్వేర్ లెగ్ వైపు స్వీప్ చేయడానికి యత్నించాడు. షాట్‌ తీసుకున్నాడు.. కానీ బంతి నేరుగా గాలిలోకి వెళ్లింది. అలర్ట్‌గా ఉన్న కోహ్లీ, క్షణాల్లోనే తన వైపు వస్తున్న బంతిని రివర్స్ క్యాప్ శైలితో క్యాచ్‌ పట్టాడు. దీంతో మాథ్యూ షార్ట్ 41 బంతుల్లో 30 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. 

Also Read: https://teluguprabha.net/sports-news/ind-vs-aus-live-score-3rd-odi-australia-236-all-out-vs-india-in-sydney/

వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్‌లో తొలి వికెట్ పడగొట్టగా, ఆస్ట్రేలియా 124 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. కాగా, పెర్త్, అడిలైడ్‌లో పరాజయాల తర్వాత భారత్ సిరీస్‌లో 0-2తో వెనుకబడింది. దీంతో సిరీస్‌ ఆస్ట్రేలియాదే. చివరి వన్డేలో  237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. 24 ఓవర్లకి 147 పరుగులు చేసి ఒక వికెట్‌ కోల్పోయింది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad