Ben Stokes vs Ravindra Jadeja: ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కు దిమ్మతిరిగే షాకిచ్చాడు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. జడ్డూ, సుందర్ సెంచరీలను అడ్డుకోవాలని చూసిన స్టోక్స్ కు గట్టి స్ట్రోకే ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసలేం జరిగిందంటే..
ఐదో రోజు ఆటలో మరో 15 ఓవర్లు మిగిలి ఉన్నాయనగా అసలు డ్రామా మెుదలైంది. జడేజా, సుందర్ లు సెంచరీలకు చేరువలో ఉన్న సమయంలో..డ్రా కోసం స్టోక్స్ జడేజా వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి యత్నించగా..జడ్డూ అందుకు నిరాకరించాడు. అంపైర్లు కూడా దానికి సుముఖంగా లేకపోవడంతో స్టోక్స్ తట్టుకోలేకపోయాడు. జడేజాతో వాగ్వాదానికి దిగాడు.
మిగతా ఇంగ్లీష్ ఆటగాళ్లు కూడా వారిద్దరిపై మాటల దాడి చేశారు. ఈ క్రమంలో ‘మీరు హ్యారీ బ్రూక్ లా టెస్టు సెంచరీ చేయాలనుకుంటున్నారా? అంటూ స్టోక్స్ నోరుపారేసుకున్నాడు. అది నా చేతుల్లో లేదు అంటూ జడేజా గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇంతలో అక్కడకు వచ్చిన జాక్ క్రాలీ షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు కదా అని అన్నాడు. వాళ్ల మాటలు పట్టించుకోకుండా జడేజా, సుందర్ బ్యాటింగ్ కొనసాగించి శతకాలు చేశారు. అనంతరం మ్యాచ్ ను డ్రాగా ముగించడానికి ఇరు జట్లు ఆంగీకరించాయి.
https://twitter.com/StarSportsIndia/status/1949531054835908637
Also read: IND VS ENG- సెంచరీలతో చెలరేగిన గిల్, జడేజా, సుందర్.. డ్రాగా నాలుగో టెస్టు..
సోక్స్ పై విమర్శలు
ఇంగ్లీష్ కెప్టెన్ ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాంటి స్థితిలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు బ్యాటింగ్ చేస్తుంటే స్టోక్స్ మ్యాచ్ ముగించేందుకు అంగీకరించేవాడా అంటూ టీమిండియా మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ప్రశ్నించాడు. మా బౌలర్లను కష్టపెట్టడం ఇష్టం లేక మ్యాచ్ ముగిద్దామని అడిగా అని మ్యాచ్ అనంతరం స్టోక్స్ వెల్లడించడం హాస్యాస్పదంగా ఉంది. ఐదు టెస్టుల సిరీస్ లో 2-1తో ఇంగ్లండ్ లీడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. చివరి టెస్టు జూలై 31న ఓవల్ లో జరగనుంది.
ఇరు జట్ల స్కోరు వివరాలు:
భారత్ తొలి ఇన్నింగ్స్ – 358/10
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్- 669/10
భారత్ రెండో ఇన్నింగ్స్- 425/4


