Sunday, November 16, 2025
HomeTop StoriesViral:'పెళ్లైన రెండో నెలలోనే నాకు అడ్డంగా దొరికిపోయాడు..' చాహల్‌పై ధనశ్రీ షాకింగ్ కామెంట్స్..

Viral:’పెళ్లైన రెండో నెలలోనే నాకు అడ్డంగా దొరికిపోయాడు..’ చాహల్‌పై ధనశ్రీ షాకింగ్ కామెంట్స్..

- Advertisement -

Dhanashree Verma Shocking Comments: భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య, డ్యానర్స్ కమ్ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ ప్రస్తుతం ప్రముఖ రియాలిటీ షో రైజ్ అండ్ ఫాల్‌లో సందడి చేస్తోంది. తాజాగా ఈ ఎపిసోడ్‌లో ధనశ్రీ చాహల్ పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెను దుమారం రేపుతున్నాయి. తమ పెళ్లైన రెండు నెలలకే అతడు నన్ను మోసం చేశాడని.. అదే మా విడాకులకు కారణమైందనే షాకింగ్ విషయాన్ని ధనశ్రీ ఆరోపించింది.

ధనశ్రీ ఏం చెప్పిందంటే?

ప్రస్తుతం ధనశ్రీ ‘రైజ్ అండ్ ఫాల్’ అనే రియాలిటీ షోలో పాల్గొంది. ఈ క్రమంలో తన సహ పోటీదారు కుబ్రా సైత్ ధనశ్రీ వివాహ బంధం గురించి ఓ ప్రశ్న అడుగుతుంది. మీ సంబంధం వర్కౌట్ అవ్వదని మీరు ఎప్పుడు గ్రహించారు అని ధనశ్రీని అడిగింది. దీనికి ధనశ్రీ సమాధనం చెప్తూ.. పెళ్లైన మెుదటి ఏడాదిలోనే.. నిజం చెప్పాలంటే రెండో నెలలోనే నేను అతన్ని (చాహల్‌ను) పట్టుకున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మాట వినగానే కుబ్రా సైతం షాక్ అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: Ind vs Pak Final -తిలక్ వర్మ కొట్టిన భారీ సిక్స్‌కు గంభీర్ రియాక్షన్ చూశారా?

నేను ఎలాంటి భరణం తీసుకోలేదు:

యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ వివాహం 2020 డిసెంబర్‌ 22న గురుగ్రామ్‌లో జరిగింది. ఈ జంట మెుదటి రెండు సంత్సరాలు చాలా అన్యోన్యంగా ఉన్నారు. ఆ ఆనందకరమైన క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్ మడియాలో పంచుకునేవారు కూడా. ధనశ్రీ చేసే డ్యాన్స్ వీడియో రీల్స్ అప్పుడప్పుడు చాహల్ కూడా కనపించేవాడు. చాహల్ మ్యాచ్ ఆడే సమయంలో ధనశ్రీ అతడిని ఎంకరేజ్ చేయడానికి గ్రౌండ్ కు స్టేడియంకు వెళ్లేది. అయితే సడన్ గా 2023లో ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి చాహల్ ను తొలగించింది. దీంతో వీరి బంధం గురించి ఊహగానాలు చెలరేగాయి. కొంత కాలానికి అవే నిజమయ్యాయి. ఈ జంట ఫిబ్రవరి 2025లో ఈ జంట పరస్పర అంగీకారంతో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన ముంబై ఫ్యామిలీ కోర్టు మార్చి 20, 205 అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. ఈ క్రమంలో ధనశ్రీ రూ.60 కోట్ల భరణం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని.. తాను ఏదీ డిమాండ్ చేయాలని ధనశ్రీ స్పష్టం చేసింది.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad