Acer Swift Lite 14 AI PC Launched: Acer తన కొత్త ల్యాప్‌టాప్‌గా Acer Swift Lite 14 AI ల్యాప్‌టాప్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ తాజా AI-ఫోకస్డ్ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ అల్ట్రా 5 CPU, 32GB వరకు RAMతో అమర్చారు. కాగా, ఈ ల్యాప్‌టాప్ Windows 11 Homeలో నడుస్తుంది. అనేక AI ఫీచర్లతో వస్తున్న ఈ ల్యాప్ టాప్ కు సంబంధించి ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
Acer Swift Lite 14 AI PC ధర:
భారతదేశంలో ఏసర్ స్విఫ్ట్ లైట్ 14 AI PC ధర 16GB RAM+ 512GB నిల్వతో కూడిన బేస్ మోడల్ రూ. 62,999 నుండి ప్రారంభమవుతుంది. ఈ ల్యాప్‌టాప్ లైట్ సిల్వర్, సన్‌సెట్ కాపర్ కలర్ ఎంపికలలో కొనుగోలుకు లభిస్తుంది. కాగా ఈ ల్యాప్‌టాప్ ఏసర్ రిటైల్ స్టోర్‌లు, కంపెనీ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు దీనిని క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్ అవుట్‌లెట్‌ల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.
Also Read: HONOR X70: 8300mAh బిగ్ బ్యాటరీతో హానర్ X70 స్మార్ట్ ఫోన్..
Acer Swift Lite 14 AI PC ఫీచర్లు:
Acer Swift Lite 14 AI PC 100% DCI-P3 కలర్ గామట్ కవరేజ్‌తో 14-అంగుళాల WUXGA (1,920×1,200 పిక్సెల్స్) OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ప్రెస్ రిలీజ్ ప్రకారం.. ల్యాప్‌టాప్ మరొక వేరియంట్ కూడా IPS డిస్ప్లేతో అందుబాటులో ఉంటుంది. కానీ కంపెనీ దాని స్పెసిఫికేషన్ల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
కొత్త Swift Lite 14 AI PC ఇంటెల్ కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్‌లతో శక్తిని కలిగి ఉంది. AI పనుల కోసం.. ఇంటెల్ AI బూస్ట్ NPU ఉందని కంపెనీ చెబుతోంది. ఈ ల్యాప్‌టాప్ 32GB వరకు LPDDR5 RAMని, 1TB వరకు SSD నిల్వతో వస్తుంది. ఈ ల్యాప్ టాప్ Windows 11 హోమ్‌లో నడుస్తుంది. Microsoft AI అసిస్టెంట్‌ను ఇన్వోక్ చేయడానికి ప్రత్యేకమైన కోపైలట్ కీని కలిగి ఉంది.
Acer Swift Lite 14 AI PC Wi-Fi 6, బ్లూటూత్ 5.1 కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా రెండు USB 3.2 Gen 2 టైప్-C పోర్ట్‌లు, ఒక USB 3.2 Gen 1 టైప్-A పోర్ట్, ఒక HDMI పోర్ట్, 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంది. ల్యాప్‌టాప్ 1.1 కిలోల బరువు. ఈ ల్యాప్ టాప్ 65W ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 50Wh బ్యాటరీని కలిగి ఉంది.


