Sunday, November 16, 2025
Homeటెక్నాలజీAI+ Smartphones: 50MP AI కేమెరా, 5000mAh బ్యాటరీతో కేవలం రూ.4,999కే AI+ స్మార్ట్ ఫోన్స్..

AI+ Smartphones: 50MP AI కేమెరా, 5000mAh బ్యాటరీతో కేవలం రూ.4,999కే AI+ స్మార్ట్ ఫోన్స్..

AI+ Smartphones Launched: తక్కువ బడ్జెట్‌లో కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా..?అయితే మీకో గుడ్ న్యూస్. కొత్త టెక్ బ్రాండ్ AI+ తన మొదటి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను భరత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ వాటిని AI + పల్స్, నోవా 5Gగా పరిచయం చేసింది. ప్రత్యేకత ఏమిటంటే ఈ పరికరాల ప్రారంభ ధర కేవలం రూ. 4,999 మాత్రమే. వీటిలో 50MP వెనుక కెమెరా, 5000mAh బిగ్ బ్యాటరీ ఉండటం విశేషం. అయితే ఇప్పుడు ఈ రెండు పరికరాల గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

ధర

ఇండియాలో AI + పల్స్ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 4,999గా, 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 6,999గా కంపెనీ పేర్కొంది. ఇదే సమయంలో AI +నోవా 5G 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,999గా, 8GB + 128GB సస్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,999గా నిర్ణయించింది. ఈ ఫోన్‌లు జూలై 12, 2025 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి. AI + Pulse 5G అమ్మకం జూలై 12 నుండి ప్రారంభమవుతుంది. మరోవైపు AI + Nova 5G అమ్మకం జూలై 13 నుండి ప్రారంభమవుతుంది.ఈ పరికరాలు బ్లాక్, నీలం, ఆకుపచ్చ, గులాబీ, ఊదా రంగుల్లో లభిస్తాయి. కాగా, మొదటి సేల్‌లో రెండు ఫోన్‌లు రూ. 500 బ్యాంక్ డిస్‌కౌంట్‌తో కొనుగోలు చేయొచ్చు.

 

Also Read: OnePlus : వన్ ప్లస్ కొత్త ఫోన్లు వచ్చేశాయి..

 

ఫీచర్లు

AI + పల్స్, AI + నోవా 5G స్మార్ట్ ఫోన్స్ 6.7-అంగుళాల HD + డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. పల్స్ 90Hz, అదేవిధంగా నోవా 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉన్నాయి. AI + పల్స్ Unisoc T615 చిప్‌సెట్‌ను అమర్చారు. అయితే AI + నోవా 5G శక్తివంతమైన Unisoc T8200 SoCని అమర్చారు. కాగా ఈ రెండు ఫోన్‌లు 1TB వరకు విస్తరించదగిన నిల్వను సపోర్ట్ చేస్తాయి. ఈ మొబైల్స్ భారతదేశ స్వదేశీ ఆపరేటింగ్ సిస్టమ్ అయిన NxtQuantum OSపై నడుస్తాయి. రెండు ఫోన్‌లలోని కనెక్టివిటీ పరంగా..Wi-Fi, GPS, బ్లూటూత్, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C పోర్ట్ అవంతి ఫీచర్లు ఉన్నాయి.

ఇక ఫోటోగ్రఫీ కోసం.. రెండు ఫోన్‌లు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్‌తో AI-సపోర్ట్ చేయబడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉన్నాయి. ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది వీడియో కాల్స్, సోషల్ మీడియాకు అనుకూలంగా ఉంటుంది. బ్యాటరీ గురించి చెప్పాలంటే.. రెండు ఫోన్‌లు 5000mAhని కలిగి ఉన్నాయి. ఇవి 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad