SmartPhones: ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈరోజు సెప్టెంబర్ 23న ప్రారంభమైంది. ఈ సేల్ లో అతి చౌకైన AI ఫోన్‌లు కూడా గొప్ప డిస్కౌంట్‌లతో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. అత్యంత సరసమైన AI+ స్మార్ట్‌ఫోన్‌లు..AI+ నోవా 5G స్మార్ట్ ఫోన్ కేవలం రూ.4,499గా, AI+ పల్స్ 5G స్మార్ట్ ఫోన్ రూ.6,999 కు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ లాంచ్ అయినా తర్వాత మార్కెట్లో మంచి స్పందన వచ్చింది. ఈ పరికరాల స్టాక్ గంట వ్యవధిలోనే అయిపోయింది. అయితే, ఇప్పుడు మళ్ళీ కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకత ఏమిటంటే? ఈ సేల్ లో ఫోన్‌లు మరింత ఆకర్షణీయమైన ధరలకు అందుబాటులో ఉన్నాయి.
also read:Smart TV Under 12K: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్ సేల్..కేవలం రూ.12వేల లోపు లభించే 5 బ్రాండెడ్ టీవీలు..
AI+ పల్స్ 5G:
AI+ పల్స్ 5G బడ్జెట్ విభాగంలో గొప్ప 5G స్మార్ట్‌ఫోన్. దీని బేస్ 4GB RAM+64GB స్టోరేజ్ మోడల్‌ను సేల్ సమయంలో రూ.4,499 కు కొనుగోలు చేయవచ్చు. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.2,000 వరకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే..90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ పనితీరు కోసం యూనిసోక్ T615 ప్రాసెసర్ అమర్చారు. AI+ పల్స్ 5Gలో 50MP AI- పవర్డ్ డ్యూయల్ రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది నెక్స్ట్ క్వాంటమ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో నడుస్తుంది.
AI+ నోవా 5G:
AI+ నోవా 5G అనేది ప్రీమియం పనితీరుతో కూడిన కొంచెం శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్. దీని బేస్ 6GBRAM+128GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో బ్యాంక్ డిస్కౌంట్‌తో రూ.6,999కి విక్రయిస్తున్నారు. పాత ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంటుంది. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా ఈ పరికరాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ AI+ నోవా 5G 120Hz హై రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.7-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది యూనిసోక్ T8200 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఫోన్‌లో 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇది స్పష్టమైన ఫోటోలు, వీడియోలను అందిస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ ద్వారా శక్తిని పొందుతుంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.


