Monday, November 17, 2025
Homeటెక్నాలజీInfosys: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిపై అట్రాసిటీ కేసు నమోదు

Infosys: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిపై అట్రాసిటీ కేసు నమోదు

భారత ఐటీ ఇండస్ట్రీలో సంచలనం నమోదైంది. ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్(Gopalakrishnan)పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఆయనతో పాటు మరో 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఏం జరిగిందంటే.. గిరిజన కమ్యూనిటీకి చెందిన దుర్గప్ప అనే వ్యక్తి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లోని సెంటర్ ఫర్ సస్టెయినబుల్ టెక్నాలజీలో ఫ్యాకల్టీ మెంబర్‌గా పచిచేశారు. అయితే 2014లో తనను హనీ ట్రాప్ కేసులో తప్పుగా ఇరికించి సర్వీసు నుంచి తొలగించారని అతడు ఆరోపించారు. అలాగే తనను కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు.

- Advertisement -

దీంతో బెంగళూరులోని 71వ సిటీ సివిల్ అండ్ సెషన్ కోర్టు ఆదేశాల మేరకు సదాశివ నగర్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. గోపాలకృష్ణన్‌తో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో గోవిందన్ రంగరాజన్, శ్రీధర్ వారియర్, సంద్యా విశ్వేశ్వర్, హరి కేవీఎస్, దాసప్ప, బలరామ్ పి, హేమలతా మిషి, ఛటోపాధ్యాయ. ప్రదీప్ డీ సావార్కర్, మనోహరన్ ఉన్నారు. కాగా ఈ ఆరోపణలపై గోపాలకృష్ణన్ ఇంతవరకు స్పందించలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad