Monday, November 17, 2025
Homeటెక్నాలజీiPhone 16: కేక పెట్టించే ఆఫర్.. కేవలం రూ.50 వేలకే ఐఫోన్‌ 16

iPhone 16: కేక పెట్టించే ఆఫర్.. కేవలం రూ.50 వేలకే ఐఫోన్‌ 16

iPhone 16 Offer: ఆపిల్ ఐఫోన్ 16 కొనాలని ఆలోచిస్తున్నారా..? ఇప్పుడు మీతో బడ్జెట్ కొంచెం తక్కువగా ఉన్న కొనుగోలు చేయొచ్చు. ఎందుకంటే జూలై 12 నుండి ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ 2025 (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)లో అనేక పరికరాలపై అద్భుతమైన డీల్స్, భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉండబోతున్నాయి. అతిపెద్ద వార్త ఏమిటంటే..? పోయిన సంవత్సరంలో మార్కెట్లో విడుదలైన ఐఫోన్ 16 దాదాపు రూ.19,901 తగ్గింపుతో సేల్‌లో అందుబాటులో ఉంటుంది.

- Advertisement -

అంతేకాకుండా ఈ సేల్ లో ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. HDFC బ్యాంక్, ఇతర ఎంపిక చేసిన కార్డులపై బ్యాంక్ ఆఫర్‌లు, నో-కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ బోనస్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

 

Also Read: Vijay devarakonda: నేను సింగిల్ కాదు: విజయ్ దేవరకొండ.. నెట్టింట్లో మళ్లీ చర్చ!

ఐఫోన్ 16 పై బంపర్ డిస్కౌంట్

ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ 2025 సమయంలో ఐఫోన్ 16 ను కేవలం రూ. 59,999 కు కొనుగోలు చేయొచ్చు. ఈ పరికరం గత ఏడాది సెప్టెంబర్‌లో రూ. 79,900 కు విడుదలైంది. అంటే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో దాదాపు రూ. 19,901 తగ్గింపు తర్వాత ఈ ఫోన్‌ను రూ. 59,999 కు సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులపై తక్షణ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది.

దీనితో పాటు.. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ద్వారా మరింత తగ్గింపు పొందవచ్చు. ఒకవేళ ఫోన్ ఎక్స్ఛేంజ్ విలువ రూ. 10,000 వరకు ఉంటే ఐఫోన్ 16 ధర కేవలం రూ.50 వేలకే వస్తుంది. సేల్ సమయంలో నో-కాస్ట్ EMI, ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ వంటి ఎంపికలు కూడా సేల్ సమయంలో అందుబాటులో ఉన్నాయి.

ఐఫోన్ 16 ఫీచర్లు

ఐఫోన్ 16 లో ఆపిల్ కొత్త డిజైన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో టైటానియం ఫ్రేమ్, ఫ్లాట్ అంచులు ఉన్నాయి. ఈ మొబైల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz ప్రోమోషన్ టెక్నాలజీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆపిల్ తాజా A18 బయోనిక్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది గొప్ప పనితీరు, బ్యాటరీ సామర్థ్యాన్ని అందిస్తుంది. మల్టీ టాస్కింగ్, హై-ఎండ్ గేమింగ్, వీడియో ఎడిటింగ్ వంటి పనులను దీనిలో చాలా సులభంగా చేయవచ్చు.

 

Also Read: The Rajasaab: ప్ర‌భాస్‌తో మిల్కీ బ్యూటీ స్టెప్పులు- రాజా సాబ్‌లో స్పెష‌ల్ సాంగ్‌!

ఇక కేమెరా విషయానికి వస్తే..ఐఫోన్ 16 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 48MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. దీంతో ఈ ఫోన్ 4K సినిమాటిక్ మోడ్, స్మార్ట్ HDR 5, డీప్ ఫ్యూజన్‌కు మద్దతు ఇస్తుంది. ఇది ఫోటోలు, వీడియోలను మరింత అద్భుతంగా చేస్తుంది. AI- మద్దతు ఉన్న పోర్ట్రెయిట్‌లు, 4K వీడియో కాలింగ్‌కు మద్దతు ఇచ్చే ముందు భాగంలో 12MP కెమెరా ఉంది.

ఐఫోన్ 16 iOS 18తో వస్తుంది. స్మార్ట్ సిరి, AI ఇమేజ్ ఎడిటింగ్, వ్యక్తిగత సూచనలు వంటి అనేక AI ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ వినియోగదారులకు తెలివైన, వేగవంతమైన, సురక్షితమైన అనుభవాన్ని అందిస్తుంది. ఐఫోన్ 16 లోని బ్యాటరీ మునుపటి కంటే మరింత శక్తివంతమైనది. దీనికి 25W ఫాస్ట్ ఛార్జింగ్, మాగ్‌సేఫ్ సపోర్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్ ఉన్నాయి. ఇది ఒకే ఛార్జ్‌పై ఒక రోజంతా సులభంగా ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad