Monday, May 13, 2024
Homeటెక్ ప్లస్E-waste: ఈ వేస్ట్ ను రీసైకిల్ చేయాల్సిందే

E-waste: ఈ వేస్ట్ ను రీసైకిల్ చేయాల్సిందే

ఎలక్ట్రానిక్ వస్తువుల్లోని క్రోమియం, మెర్క్యూరీ లాంటివి చాలా డేంజర్

సెయింట్ మేరీ ఇంజనీరింగ్ కాలేజ్ పోచంపల్లి వద్ద ఇంజనీరింగ్ విద్యార్థులకు కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ బోడ.నాగేశ్వర రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువులను, మానిటర్స్, మ్యూజిక్ సిస్టమ్స్, కీబోర్డ్ , ఎయిర్ కండిషనర్స్, ఫోన్స్ ,ప్రింటర్స్ ,ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను ఈ వేస్ట్ రీసైకిలింగ్ చేసే పరిశ్రమలకు అందించాలన్నారు.పనికిరాని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ను ఈ వేస్ట్ విధానం ద్వారానే శుద్ధి చేయాలన్నారు. డాక్టర్ స్వాతి గౌడ్ ప్రిన్సిపల్, సెంట్ మేరీస్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ప్రజా ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా వేస్ట్ ను తప్పనిసరిగా రీసైక్లింగ్ చేయాలి.

- Advertisement -


ఎలక్ట్రానిక్ వేస్ట్ లో ఉండే క్రోమియం, మెర్క్యూరీ ప్లాస్టిక్, రసాయనాలు వల్ల పర్యావరణం కలుషితం అవుతుందని విద్యార్థుల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జి సత్యనారాయణ రెడ్డి డైరెక్టర్
పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News