Motorola Edge 50 Fusion Discount: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో GOAT సేల్ నడుస్తోంది.ఈరోజు అంటే జూలై 17న సేల్ చివరి రోజు. ఈ సేల్‌లో అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ACలు మొదలైన వాటిపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఇందులో భాగంగా పోయిన ఏడాది విడుదల అయినా మోటరోలా 12GB RAM ఫోన్ ఎడ్జ్ 50 ఫ్యూజన్‌ను అత్యల్ప ధరకు కొనుగోలు చేయవచ్చు. కర్వ్డ్ డిస్‌ప్లే, వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్, 5000mAh బ్యాటరీతో కూడిన ఈ ఫోన్ లాంచ్ ధర కంటే వేల రూపాయల చౌకగా లభిస్తుంది. ఇప్పుడు
మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ ఆఫర్:
మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 25,999కి విడుదల చేసారు. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో GOAT సేల్ ఆఫర్ లో భాగంగా దీని రూ. 18,999కే కొనుగోలు చేయొచ్చు. ఇదే సమయంలో దాని 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 20,999కి అందుబాటులో ఉంది. దీనిని రూ.27,999కి లాంచ్ చేశారు. ఫోన్ ధరలో దాదాపు రూ.7,000 పెద్ద మొత్తం డిస్కౌంట్ పొందుతాం. దీనితో పాటు ఫోన్ కొనుగోలుపై రూ.5,000 బ్యాంక్ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. రూ.16,100 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
Also Read: Acer Swift Lite 14 AI PC: AI ఫీచర్లతో ‘ఏసర్’ ల్యాప్‌టాప్ లాంచ్.. ధరెంతో తెలుసా..?
మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫీచర్లు:
ఈ మోటరోలా ఫోన్ 6.67-అంగుళాల 3D కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్‌లో AMOLED డిస్ప్లే ఉపయోగించారు. ఇది 144 Hz హై రిఫ్రెష్ రేట్ ఫీచర్‌కు మద్దతు ఇస్తుంది. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ లభిస్తుంది. అలాగే, ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్ డిస్ప్లేలో స్మార్ట్ వాటర్ టచ్ ప్రొటెక్షన్ అలాగే IP68 రేటింగ్ ఉంది. ఫోన్ వెనుక భాగంలో వీగన్ లెదర్ ఫినిషింగ్ అందుబాటులో ఉంటుంది.
ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్‌లో పనిచేస్తుంది. ఇది 12GB RAM+256GB ఇంటర్నల్ స్టోరేజ్‌కు మద్దతు ఇస్తుంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా విస్తరించవచ్చు. దాని వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌లో 50MP ప్రధాన OIS కెమెరా, 13MP సెకండరీ కెమెరా ఉంటాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 32MP కెమెరా ఉంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 68W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌తో ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హలో OSలో పనిచేస్తుంది.


