కొత్త సంవత్సర ప్రారంభంలో బంగారం ధరల్లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నప్పటికీ, ఫిబ్రవరి నెలలో ధరలు భారీగా పెరిగాయి. ఈ పెరిగిన ధరలు సామాన్య ప్రజలు, వ్యాపారులు, పెట్టుబడిదారులకు ఆందోళన కలిగించాయి. ఫిబ్రవరి నెలలో బంగారం ధరలు అత్యధికంగా పెరిగినప్పటికీ, మార్చి మొదట్లో ధరలు కొంచెం తగ్గినట్లు కనిపించాయి. ఇది బంగారం కొనాలనుకున్నవారికి కొంత ఊరట కలిగించింది. కానీ, రెండు రోజులుగా ధరలు మళ్లీ పెరుగుతున్నాయి, ఇది ఆందోళనకు గురి చేస్తోంది.
మార్చి 8న 22 క్యారట్ల బంగారం ధర ఒక్క గ్రాముకు రూ.8040 గా ఉండగా, 10 గ్రాముల ధర రూ.80400 వరకు చేరింది. 24 క్యారట్ల బంగారం ధర ఒక్క గ్రాముకు రూ.8771 గా ఉండగా, 10 గ్రాములకు రూ.87710 కి చేరింది. అయితే, మార్చి 9న బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు లేవు.
మార్చి 10న 22 క్యారట్ల బంగారం ధర రూ.10 లు పెరిగి రూ.8050 కి చేరింది, అంటే 10 గ్రాముల ధర రూ.80500 గా ఉంది. అదే 24 క్యారట్ల బంగారం ధర ఒక్క గ్రాముకు రూ.11 లు పెరిగి, ఇప్పుడు ఒక గ్రాము ధర రూ.8782 గా ఉంది. అంటే 10 గ్రాములకు రూ.87820 గా నమోదయ్యాయి.
ఈ ధరల మార్పుల నేపథ్యంలో, బంగారం కొనేవారు మరికొన్ని రోజులు ఓపికగా ఉండి వేచి ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వారందరూ ఈ నెలలో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.