Saturday, March 15, 2025
Homeటెక్ ప్లస్Gold Price: మహిళలకు శుభవార్త.. బంగారం ధర తగ్గింది..

Gold Price: మహిళలకు శుభవార్త.. బంగారం ధర తగ్గింది..

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ, పెరుగుతూ కొనసాగుతున్నాయి. మార్చి మొదటి వారంలో కొంత తగ్గినట్లయిన పసిడి ధర, మళ్లీ పెరిగింది. దీంతో బంగారం కొనాలని అనుకుంటున్న ప్ర‌జ‌లు చాలామందికి కాస్త కన్‌ఫ్యూజన్ ఏర్పడింది. మార్కెట్‌లో పసిడి ధరలు మళ్ళీ పుంజుకున్నాయి. దీంతో బంగారం ధర పెరిగిందా, తగ్గిందా అని సామాన్యులు అసంతృప్తిగా ఉన్నారు.

- Advertisement -

ఈ రోజు (మార్చి 15)కి బంగారం ధరలు ఇంకా మారాయి. పెళ్లిళ్ల సీజన్ కారణంగా కొందరు బంగారం కొనాలని నిర్ణయించుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.89,780 ఉండగా, ఈ రోజు రూ.89,670కి తగ్గింది. అదే విధంగా, 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్న రూ.82,310గా ఉండగా, ఈ రోజు రూ.82,210కి చేరింది.

అంతే కాదు, 18 క్యారెట్ల బంగారం ధర కూడా కొంత తగ్గింది. నిన్న 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.67,340 ఉండగా, ఈ రోజు అది రూ.67,260కి తగ్గింది. ఈ ధర మార్పులతో పసిడి కొనాలనుకునే వారికీ పసిడి రేటు గమనించడం చాలా ముఖ్యం.

ఇక, వెండి ధరల విషయానికి వస్తే, దేశవ్యాప్తంగా కిలో వెండి ధర రూ.1,03,000గా ఉంది. అయితే, హైదరాబాద్‌లో ఈ ధర రూ.1,12,000 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందా లేదా తగ్గుతాయా అన్న దాని పై అనేక వ్యూహాలు ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News