Tuesday, October 8, 2024
Homeటెక్ ప్లస్Hero glamour: ఓల్డ్ ఈజ్ గోల్డ్, మళ్లీ హీరో గ్లామర్

Hero glamour: ఓల్డ్ ఈజ్ గోల్డ్, మళ్లీ హీరో గ్లామర్

హీరో గ్లామర్ కు పెరుగుతున్న గ్లామర్

ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ హీరో తమ కస్టమర్ల నుండి వస్తున్న డిమాండ్ మేరకు, పాత గ్లామర్ బండిని కొత్త రంగులతో, శుక్రవారం రోజున మార్కెట్లో విడుదల చేసింది. ఈ మేరకు జమ్మికుంట పట్టణంలోని పవన్ మోటార్స్ హీరో షోరూంలో, పట్టణ సీ,ఐ, బి,రమేష్, నూతన గ్లామర్ బండిని లాంచ్ చేశారు. (150) సి,సి, సెగ్మెంట్లో పెను సంచలనం సృష్టించిన గ్లామర్ ను బి,ఎస్, (4), నుండి బి,ఎస్,( 6), గా మారిన క్రమంలో, కంపెనీ గ్లామర్ బండి యొక్క రూపురేఖలను మార్చేసింది, దీనితో కస్టమర్ల, నిరుత్సాహానికి లోనయ్యారు. 125 సిసి సెగ్మెంట్ల అమ్మకాలలో అగ్రగామిగా ఉండే గ్లామర్ అమ్మకాలు పూర్తిగా దిగజారడంతో, ఇటు డీలర్ల నుండి, అటు కస్టమర్ల నుండి, వస్తున్న కోరిక,మేరకు, మళ్లీ పాత మోడల్ గ్లామర్ బండిని అన్ని అంగులతో లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందని షోరూం యజమాని, ఎలిమినేటి రాజేంద్రప్రసాద్ తెలిపారు, కొత్త.అంగులతో మార్కెట్లోకి విడుదలైన గ్లామర్ బండిని చూడడానికి పలువురు పట్టణ ప్రజలు ఆసక్తి చూపారు. ఈ గ్లామర్ బండికి అదనంగా డిజిటల్ మీటర్, మైలేజ్ ఇండికేటర్, సౌకర్యవంతమైన సీటు, చార్జింగ్ పోర్టు, లను ఏర్పాటు చేశారని షోరూం యజమాని అన్నారు, గ్లామర్ బండి లాంచింగ్ ప్రకటన వెలువడిన వెంటనే అనేకమంది కస్టమర్ల నుండి ఎంక్వయిరీలు వస్తున్నాయని తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో, సీ,ఐ, బి రమేష్. తో పాటు, ప్రముఖ వ్యాపారి బచ్చు భాస్కర్. జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు, జి రాజమౌళి, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు, చందా రాజు, పత్తి వ్యాపారి, ముక్క నారాయణ, నగునూరి రవీందర్, జమ్మికుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నర్సిని శ్రీనివాస్, వ్యాపారస్తులు, సుబ్బారావు, వీర్రాజు, సామల ప్రతాప్ రెడ్డి, సిరిమల్లె, జయేందర్, ప్రభాకర్ రావు, మెకానిక్ సంఘం అధ్యక్షులు సింగర వేణి ఓదెలు, లక్ష్మణ్, శ్రీనుతో పాటు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News