Sunday, November 16, 2025
Homeటెక్నాలజీiPhone 17 Vs iPhone 16: కొత్త ఐఫోన్‌ 17 కొనాలా? ఐఫోన్ 16 కొనాలా?...

iPhone 17 Vs iPhone 16: కొత్త ఐఫోన్‌ 17 కొనాలా? ఐఫోన్ 16 కొనాలా? రెండింటిలో ఏది బెస్ట్‌ ఆప్షన్‌.. పూర్తి వివరాలివే..!

iPhone 17 Vs iPhone 16 Price and Features: ప్రముఖ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ తన ఐఫోన్ 17ను భారత మార్కెట్‌లో రిలీజ్‌ చేసింది. ఇప్పటికే అమ్మకాలు సైతం ప్రారంభించింది. దేశంలోని అనేక ఆపిల్‌ స్టోర్ల వద్ద కస్టమర్లు బారులు తీరడాన్ని బట్టి చూస్తే ఐఫోన్‌ 17కు ఉన్న క్రేజ్‌ ఏంటో తెలిసిపోతుంది. ఈ ఫోన్‌లోని అనేక అద్భుతమైన ఫీచర్లు యూజర్లను కట్టి పడేస్తున్నాయి. అయితే, ధర ఎక్కువగా ఉండటంతో చాలా మంది దీన్ని కొనేందుకు వెనకడుగువేస్తున్నారు. మరోవైపు, కొత్త సిరీస్‌ రిలీజ్‌ కావడంతో.. ఆపిల్‌ తన పాత ఐఫోన్‌ 16 ధరను తగ్గించింది. ఈ నేపథ్యంలో ఐఫోన్‌ 17, ఐఫోన్‌ 16లో ఏది కొనడం మంచిది? అనే విషయంపై అందరూ ఆరా తీస్తున్నారు. మీరు కూడా ఐఫోన్‌ 17ను కొనాలని చూస్తుంటే ఈ విషయాలను తెలుసుకోండి.

- Advertisement -

ఐఫోన్ 16, ఐఫోన్ 17 మధ్య ఉన్న ప్రధాన తేడాలివే..!

డిస్‌ప్లేలో ఏది బెస్ట్?
ఐఫోన్ 17లో 6.3 ఇంచెస్ OLED డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లేను ప్రొమోషన్ టెక్నాలజీతో డిజైన్‌ చేశారు. దీని వల్ల స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 1Hz నుండి 120Hz వరకు మార్చుకునే అవకాశం ఉంటుంది. దీని బ్రైట్‌నెస్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ డిస్‌ప్లే గరిష్ట బ్రైట్‌నెస్ 3000 నిట్స్ వరకు ఉంటుంది. ఇది ఐఫోన్ 16లో ఉన్న 2000 నిట్స్ కంటే చాలా ఎక్కువ. అంతేకాకుండా స్క్రీన్ చుట్టూ ఉన్న బెజెల్స్ సన్నగా ఉంటుంది. స్క్రీన్‌కు సిరామిక్ షీల్డ్ 2 ప్రోటెక్షన్‌ ఉంటుంది. డిస్‌ప్లే ఐఫోన్‌ 16తో పోలిస్తే ఐఫోన్ 17 బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పవచ్చు.

Also Read: https://teluguprabha.net/viral/cow-attack-video-viral-socialmedia/

కెమెరా ఎలా ఉంటుంది?
ఇక, కెమెరా విషయానికి వస్తే.. ఐఫోన్ 17లో అనేక గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది. ఐఫోన్ 17 వెనుక భాగంలో 48 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్ కెమెరాను అందించింది. ఐఫోన్ 16లోని 12MP అల్ట్రావైడ్ లెన్స్ కెమెరాతో పోలిస్తే.. దీనిలోని కెమెరా మెరుగ్గా ఉంటుంది. దీనివల్ల ఫోటోలు మరింత స్పష్టంగా తీయవచ్చు. ఇక, సెల్ఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 17లో 18MP సెంటర్ స్టేజ్ కెమెరా ఉంది. ఇది గ్రూప్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం బాగా ఉపయోగపడుతుంది. ఇక, ఐఫోన్ 16లో 12MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ విషయంలోనూ ఐఫోన్‌ 17 బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పవచ్చు.

పర్ఫామెన్స్‌ – స్టోరేజ్ స్పేస్‌
ఐఫోన్ 17లో కొత్త A19 బయోనిక్ చిప్ ఉంటుంది. ఇది ఐఫోన్ 16లో ఉన్న A18 చిప్ కంటే వేగంగా పనిచేస్తుంది. ఐఫోన్ 17 బేస్ మోడల్ స్టోరేజ్ 256GB తో మొదలవుతుంది. ఐఫోన్ 16 బేస్ మోడల్ 128GBతో వస్తుంది. భారీ యాప్‌లు, మీడియా ఫైల్స్, AI ఫీచర్లు ఎక్కువగా వాడే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. రెండు ఫోనల్లోనూ iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది.

బ్యాటరీ – కనెక్టివిటీ ఆప్షన్లు

ఐఫోన్ 17 బ్యాటరీ లైఫ్ ఐఫోన్ 16 కంటే దాదాపు 8 గంటలు ఎక్కువ. 40W ఛార్జర్‌తో కేవలం 20 నిమిషాల్లో 0 నుండి 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఐఫోన్ 16కి అదే ఛార్జింగ్‌కు దాదాపు 30 నిమిషాలు పడుతుంది. కనెక్టివిటీ పరంగా ఐఫోన్ 17లో బ్లూటూత్ 6, మెరుగైన వైఫై చిప్ వంటివి అందించింది.

ఏ ఫోన్ కొనడం మంచిది? 

ఐఫోన్ 16తో పోలిస్తే ఐఫోన్‌ 17లో మెరుగైన కెమెరా, బెస్ట్‌ పర్ఫామెన్స్‌, మెరుగైన డిస్‌ప్లే, లాంగ్‌ లాస్టింగ్‌ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, ఐఫోన్ 17లో చాలా అప్‌డేట్ ఫీచర్స్‌ ఉన్నప్పటికీ.. దీని ధర ఐఫోన్‌ 16తో పోలిస్తే రెండింతలు ఎక్కువ ఉండటంతో చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. అందుకే, ఐఫోన్ 16 కొనడమే శ్రేయస్కరమని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం, భారత మార్కెట్‌లో ఐఫోన్ 17 ధర రూ.82,990 నుండి ప్రారంభమవుతుండగా.. ఐఫోన్ 16 రూ.69,990కే లభిస్తోంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad