JBL Tour Pro 3 Launched: JBL తన తాజా ఫ్లాగ్‌షిప్ TWS ఇయర్‌బడ్స్ JBL టూర్ ప్రో 3ని భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ ఇయర్‌బడ్‌లును JBL స్పేషియల్ 360 ఆడియో హెడ్ ట్రాకింగ్, టచ్‌స్క్రీన్ డిస్ప్లే, అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సిస్టమ్ వంటి గొప్ప ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతోపాటు బడ్స్ వైర్‌లెస్ ఆడియో ట్రాన్స్‌మిటర్‌తో కూడిన కొత్తగా రూపొందించిన స్మార్ట్ ఛార్జింగ్ కేస్‌ను కూడా పొందుతాయి. ఇప్పుడు JBL టూర్ ప్రో 3 కు సంబంధించి ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
ధర
JBL టూర్ ప్రో 3 ఇండియాలో రూ.29,999 ధరకు అందుబాటులో ఉంది. సేల్స్ జూలై 11 నుండి JBL.comలో బ్లాక్, లాట్టే కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయొచ్చు. ఇప్పటికే USలో $330 ధరకు అందుబాటులో ఉంది.
Also Read: Bank Holiday July: బ్యాంకు సెలవులున్నాయ్.. ముందే జాగ్రత్తపడండి
ఫీచర్లు
JBL టూర్ ప్రో 3 అద్భుతమైన ఫీచర్ దీని రెండవ తరం స్మార్ట్ ఛార్జింగ్ కేసు. ఇది వైర్‌లెస్ ఆడియో ట్రాన్స్‌మిటర్‌గా కూడా పనిచేస్తుంది. దీనితో వినియోగదారులు బ్లూటూత్ లేకుండా నేరుగా USB లేదా అనలాగ్ ఆడియో మూలాలకు (ఇన్-ఫ్లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌లు వంటివి) ఇయర్‌బడ్‌లను కనెక్ట్ చేయవచ్చు. ఇది జర్నీ, గేమింగ్ కోసం చాలా ఉపయోగపడుతుంది. ఇక ఛార్జింగ్ కేసులో 1.57-అంగుళాల టచ్‌స్క్రీన్ ఉంటుంది. ఇది మ్యూజిక్ కంట్రోల్, కాలర్ ID, ID3 ట్యాగ్ సమాచారం, కాల్స్ అలెర్ట్ లు వంటి ఫీచర్లను అందిస్తుంది.
అంతేకాకుండా మెరుగైన ఆడియో అనుభూతి కోసం..ఈ ఇయర్‌బడ్‌లు హైబ్రిడ్ డ్యూయల్-డ్రైవర్ సెటప్‌ను కలిగి ఉన్నాయి. ప్రతి ఇయర్‌బడ్‌లో 10.2mm డైనమిక్ డ్రైవర్, 5.1mm x 2.8mm బ్యాలెన్స్‌డ్ ఆర్మేచర్ ఉన్నాయి. LDAC సపోర్ట్ (ఆండ్రాయిడ్ కోసం మాత్రమే) హై-రిజల్యూషన్ వైర్‌లెస్ ఆడియోను వినడానికి అనుమతిస్తుంది.
JBL టూర్ ప్రో 3 ఇయర్‌బడ్‌ల JBL స్పేషియల్ 360 ఆడియో, హెడ్ ట్రాకింగ్‌తో సినిమా, గేమింగ్ అనుభవాన్ని అందిస్తాయి. ఇందులో 6 మైక్రోఫోన్‌లు, విండ్‌ప్రూఫ్ డిజైన్, కాల్ నాణ్యతను మెరుగుపరచడానికి కొత్త JBL క్రిస్టల్ AI అల్గోరిథం ఉన్నాయి. పర్సొని-ఫై 3.0 ద్వారా వినియోగదారులు తమకు తగ్గట్టుగా ఆడియోను అనుకూలీకరించవచ్చు. ఈ ఇయర్‌బడ్‌లు IP55 నీటి నిరోధకత, 44 గంటల (కేస్‌తో సహా) మొత్తం బ్యాటరీ లైఫ్‌తో మల్టీ-పాయింట్ కనెక్షన్‌ను పొందుతాయి. దీనితో వాటిని పదే పదే ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు.


