Monday, June 16, 2025
Homeటెక్ ప్లస్Mahindra Scorpio N Z4: 7 సీటర్లలో ది బెస్ట్ ఈ కొత్త కారు..

Mahindra Scorpio N Z4: 7 సీటర్లలో ది బెస్ట్ ఈ కొత్త కారు..

Mahindra Scorpio N Z4 Launched: మహీంద్రా & మహీంద్రా తన సరికొత్త SUV స్కార్పియో-ఎన్ కొత్త వేరియంట్, Z4 ఆటోమేటిక్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. ధరల విషయానికి వస్తే, Z4 పెట్రోల్ ఆటోమేటిక్ రూ.17.39 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు Z4 డీజిల్ ఆటోమేటిక్ రూ.17.86 లక్షల ధరను కలిగి ఉన్నాయి. ఇవి 7 సీటర్లోనే అందుబాటులో ఉన్నాయి. ఈ అప్‌డేట్‌కు ముందు, స్కార్పియో-Nలోని ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక డీజిల్‌లో Z6 వేరియంట్‌లో (ధర ₹ 18.91 లక్షలు), పెట్రోల్‌లో Z8 సెలెక్ట్ వేరియంట్‌లో (ధర ₹ 19.06 లక్షలు) అందుబాటులో ఉండేది.

- Advertisement -

ఇతర కార్లతో పోలిస్తే, కొత్త స్కార్పియో Z4 ఆటోమేటిక్ మోడల్ పెట్రోల్‌లో రూ.1.05 లక్షలు, డీజిల్‌లో రూ.1.67 లక్షలు చౌకగా ఉంది. దేశంలో ఇది టాటా హారియర్, సఫారీలతో పోటీపడుతుంది. అయితే ఈ ధర పరిధిలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ టాప్ లైన్ వేరియంట్‌లకు కూడా గట్టి ఇవ్వనుంది. కొత్త మోడల్ను బేస్ వేరియంట్ Z2 పైన ఉంచారు. దీని వలన ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన స్కార్పియో N మరింత చౌకగా మారింది. Z4 వేరియంట్ గతంలో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభ్యమయ్యేది. ఇప్పుడు దీనికి పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఎంపికలతో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇచ్చారు. ఇవి కాకుండా వేరే దీనిలో ఎటువంటి మార్పులు చేయలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News