Moto G67 Power Launch Date,Features: చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మోటోరోలా నవంబర్ 6 భారత్ టెక్ మార్కెట్లో తన శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ మోటో G67 పవర్ 5Gని విడుదల చేయనుంది. ఈ పరికరం శక్తివంతమైన బ్యాటరీతో బడ్జెట్ విభాగంలో వస్తుందని భావిస్తున్నారు. ఈ పరికరం స్పెసిఫికేషన్‌లు ఇప్పటికే వెల్లడయ్యాయి. ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ మోటో పవర్ ఫోన్ వివరాలు రివీల్ అయ్యాయి. ఇప్పుడు ఈ మోటో లాంచ్ డేట్, ధర, ఫీచర్ల వివరాల గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
మోటోరోలా స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 8GB RAMని కలిగి ఉంటుంది. రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అది 128GB, 256GB స్టోరేజీ. ఈ పరికరం కంపెనీ వెబ్‌సైట్‌లో సిలాంట్రో, బ్లూ కురాకో పారాచూట్ పర్పుల్ వంటి మూడు రంగు ఎంపికలలో లిస్ట్ అయింది. మోటరోలా స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల LCD ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా 7i ద్వారా రక్షణ పొందుతుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్, అడ్రినో GPU ద్వారా శక్తిని పొందుతుంది. మూడు సంవత్సరాల OS అప్‌గ్రేడ్‌లను అందుకుంటుంది. ఫోన్ గూగుల్ జెమిని ఏఐ వాయిస్ అసిస్టెంట్‌ను కలిగి ఉంటుంది.
మోటరోలా కొత్త పరికరం వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను అందిస్తుంది. ఇందులో 50MP ప్రధాన సోనీ LYT-600 ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, టూ-ఇన్-వన్ ఫ్లికర్ కెమెరా లెన్స్ ఉంటాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం.. ఫోన్ 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్లను కూడా కలిగి ఉంటుంది. ధర విషయానికొస్తే.. కంపెనీ ఈ కొత్త మోటో G67 పవర్‌ను బడ్జెట్ విభాగంలో కూడా ప్రవేశపెట్టవచ్చు. దీనిని దాదాపు రూ.15,000 కు కొనుగోలు చేయవచ్చు. కంపెనీ దీనిని పోటీ ధర వద్ద అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.


