Sunday, November 16, 2025
Homeటెక్నాలజీAI Deep Fake: 'డీప్‌ఫేక్‌'కు చెక్‌.. ఏఐపై IT చట్టంలో కేంద్రం కీలక మార్పులు

AI Deep Fake: ‘డీప్‌ఫేక్‌’కు చెక్‌.. ఏఐపై IT చట్టంలో కేంద్రం కీలక మార్పులు

AI Content Labelling Central Government Plans: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రెండ్‌ మొదలైనప్పటి నుంచి ఇది నిజమా అబద్ధమా అనే సందిగ్ధత చాలా మందిలో నెలకొంటోంది. ఒక్కోసారి ఏఐ వీడియోలను చూస్తే వీళ్లు నిజంగానే మనుషులు.. క్రియేటివిటీ కాదు అనే సందేహం కలుగుతోంది. ఈ క్రమంలో ఏఐ ద్వారా కొందరు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రముఖులకు పరువు నష్టం కలిగిస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.  

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/sanitation-worker-pawns-mangalsutra-funds-treatment/

ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ ద్వారా క్రియేట్ చేస్తున్న ‘డీప్‌ఫేక్‌’ వీడియోలు, ఫొటోల ద్వారా ముఖ్యంగా ప్రముఖ వ్యక్తులు, రాజకీయ నాయకులకు తలనొప్పి ఏర్పడుతోంది. వారికి సంబంధించిన తప్పుడు వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. బాధితుల ప్రతిష్ఠకు భంగం కలగడంతో ఇప్పటికే దీనిపై పలువురు కోర్టు మెట్లు కూడా ఎక్కారు. 

ఈ క్రమంలో ఈ డీప్‌ఫేక్‌ ముప్పును ఎదుర్కోవడానికి, ఆన్‌లైన్‌లో సోషల్ మీడియా క్రెడిబిలిటీ కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, ఏఐ ఉపయోగించి సృష్టించిన కంటెంట్‌కు లేబులింగ్‌ను తప్పనిసరి చేసే దిశగా నిబంధనలను తీసుకొస్తోంది. దీనర్థం ఏఐ ద్వారా రూపొందించిన ప్రతీ వీడియో లేదా చిత్రంలో, అది ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ ద్వారా తయారైందని స్పష్టంగా తెలిపేలా “ఏఐ జెనరేటెడ్” అనే లేబుల్‌ను తప్పనిసరి చేయనుంది.

Also Read: https://teluguprabha.net/technology-news/samsung-first-ai-powered-tv-app-launch/

ప్రస్తుత ఐటీ నిబంధనలు, 2021 ప్రకారం, ఆన్‌లైన్ వేదికలు అక్రమ కంటెంట్‌ను తొలగించాలని కేంద్రం తెలిపింది. డీప్‌ఫేక్‌ల విషయంలోనూ, అవి నకిలీ సమాచారాన్ని వ్యాప్తి చేస్తే లేదా ఇతరులను అనుకరిస్తే వాటిని గుర్తించి తొలగించాలని సోషల్ మీడియా సంస్థలకు ప్రభుత్వం సూచించింది. అయితే, కేవలం తొలగించడం మాత్రమే కాకుండా, ముందస్తు నివారణ కోసం కంటెంట్ లేబులింగ్ విధానాన్ని తీసుకురావడం అత్యంత కీలకం కానుంది. త్వరలో ఈ కొత్త నిబంధనలను ప్రకటించనుంది. 

ఐటీ చట్టంలో ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తే, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు మరింత పారదర్శకంగా, బాధ్యతగా వ్యవహరించాలి. డీప్‌ఫేక్ కంటెంట్‌ను అరికట్టడానికి సాంకేతిక, చట్టపరమైన నియమాలను కఠినతరం చేయాలని పార్లమెంటరీ కమిటీ కూడా సూచించడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై టెక్‌ నిపుణులు సైతం సానుకూల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad