మోస్ట్ పాపులర్ ఎలక్ట్రికల్ బైక్స్ తయారీ సంస్ధ ఓలా. ఈ సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓలా ఎలక్ట్రిక్ థర్డ్ జనరేషన్ వేదికగా బైక్స్ ను మార్కెట్లోకి శుక్రవారం విడుదల చేసింది. ఇందులో S1x, S1x+,S1 Pro, S1Pro+ ను లాంచ్ చేసింది.
మెుత్తం 4 రకాల బైక్స్ ను డిపరెంట్ బ్యాటరీ ఆప్షనల్లో మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ప్రారంభ ధరలు రూ.79 వేల నుంచి ఉన్నాయి. అత్యధికంగా రూ.1.69 లక్షల వరకు వీటి ధరలున్నాయి. ఇంతకు ముందు ఉన్న మోడళ్లకు అదనంగా S1Pro+ మోడల్ బైక్ ను తీసుకురావటం సరికొత్త విషయమని కంపెనీ సీఈఓ భవీశ్ అగర్వాల్ తెలిపారు.
జనరేషన్ 2 స్కూటర్లపై రూ.35వేల వరకు డిస్కౌంట్
ఈ బైక్స్ నేటి నుంచి (జనవరి 31) నుంచే ఆర్ఢర్స్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఫిబ్రవరి రెండో వారం నుంచి డెలివరీలు మెుదలవుతాయని చెప్పింది. మరో గుడ్ న్యూస్ కూడా తెలిపింది. రోడ్‌స్టర్ ఎక్స్ మోటార్ సైకిల్‌ను ఫిబ్రవరి 5 న లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. కొత్త స్కూటర్లు లాంచ్ అయిన నేపథ్యంలో జనరేషన్ 2 స్కూటర్లపై రూ.35వేల వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు కంపెనీ పేర్కొంది.
ఫిబ్రవరిలో మూవ్ ఓఎస్ 5ను తీసుకువస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందులో స్మార్ట్‌వాచ్ యాప్, స్మార్ట్ పార్క్, రోడ్ ట్రిప్ మోడ్, లైవ్ లొకేషన్ షేరింగ్ వంటి ఫీచర్లు ఉండబోతున్నాయని చెప్పింది. జనరేషన్ 3 పోర్ట్‌ఫోలియోపై వచ్చిన స్కూట్లర్లకు, బ్యాటరీపైనా 3 ఏళ్లు /40 వేల కిలోమీటర్ల వారెంటీ ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది రూ.14,999 చెల్లించి బ్యాటరీ వారెంటీని 8 ఏళ్లు 1.25 లక్షల కిలోమీటర్లకు పెంచుకోవచ్చని కంపెనీ పేర్కొంది.
మోడళ్లు ఇవే..
ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ఎస్1 ప్రో+ పేరిట కొత్త స్కూటర్‌ను మార్కెట్లోకి ఓలా పరిచయం చేసింది. ఇది 5.3kWh, 4kWh బ్యాటరీ ఆప్షన్లతో వస్తోంది.
వీటి ధరలు రూ.1,69,999 రూ.1,54,999గా కంపెనీ నిర్ణయించింది.
ఎస్ 1 ప్రో 4kWh బ్యాటరీ వేరియంట్ ధర రూ.1,34,999;
3kWh బ్యాటరీ వేరియంట్ ధర రూ.1,14,999గా నిర్ణయించారు.
ఎస్ 1ఎక్స్
2kWh బ్యాటరీ వేరియంట్ ధర రూ.79,999గా నిర్ణయించారు.
3kWh వేరియంట్ ధర రూ.89,999,
4kWh ధర రూ.99,999గా కంపెనీ వెల్లడించింది.
ఎస్1 ఎక్స్+ 4kWh
బ్యాటరీ ఆప్షన్‌తో మాత్రమే వస్తోంది. దీని ధరను కంపెనీ రూ.1,07,999గా నిర్ణయించారు. జనరేషన్ 3 ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన ఈ బైక్స్ సామర్థ్యం, భద్రత పరంగా మెరుగైన పనితీరు కనబరుస్తాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.