Monday, November 17, 2025
Homeటెక్నాలజీOla S1 Pro: ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్ తో 320...

Ola S1 Pro: ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్ తో 320 కి.మీ రయ్.. రయ్!

OLA S1 Pro Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ తమిళనాడులోని సంకల్ప్ 2025 కార్యక్రమంలో తమ కొత్త ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్‌ను లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1,49,999. కేవలం రూ.999తో బుకింగ్ చేసుకోవచ్చు. డెలివరీలు మాత్రం 2026 జనవరి నుంచి ప్రారంభమవుతాయి. ఈ స్కూటర్ స్పోర్టీ డిజైన్, అధునాతన ఫీచర్లతో భారత మార్కెట్‌లో సంచలనం సృష్టించనుందని తెలుస్తుంది.

ఈ స్కూటర్ 16 కిలోవాట్ల ఫెర్రైట్ మోటారుతో 71 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5.2 కిలోవాట్ గంటల 4680 బ్యాటరీతో ఒక్కసారి ఛార్జ్‌తో 320 కి.మీ రేంజ్ ఇస్తుంది. 0-40 కి.మీ వేగాన్ని 2 సెకన్లలో, గరిష్టంగా 152 కి.మీ/గం వేగం అందుకుంటుంది. ఇది ఏథర్ 450 ఏపెక్స్‌తో పోటీ పడుతుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, ప్రీలోడ్-అడ్జస్టబుల్ రియర్ మోనోషాక్ సస్పెన్షన్, 14 అంగుళాల ఫ్రంట్ అల్లాయ్ వీల్, డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

- Advertisement -

ALSO READ: NIA Arrests Terror Suspect : ధర్మవరంలో ఉగ్ర కలకలం… ఎన్ఐఏ అరెస్ట్, 16 సిమ్ కార్డుల స్వాధీనం

భారత్‌లో తొలిసారిగా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఏడీఏఎస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్ ఇందులో ఉంది. కొలిషన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ అలర్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ వంటివి రైడర్ భద్రతను పెంచుతాయి. ఫ్రంట్ కెమెరా డాష్‌క్యామ్‌గా, దొంగతనంకాకుండా రికార్డింగ్‌కు ఉపయోగపడుతుంది. వాయిస్ అసిస్టెంట్, కస్టమైజైడ్జ్ డిస్‌ప్లే, స్మార్ట్ ఛార్జింగ్, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ వంటి ఫీచర్లు మోవ్ ఓఎస్ 6తో అందుబాటులో ఉన్నాయి.

డిజైన్‌లో కార్బన్ ఫైబర్ ఫెండర్, గ్రాబ్ రైల్స్, ఎరోడైనమిక్ బాడీ, ఎల్ఈడీ లైటింగ్, కొత్త సీటు డిజైన్ ఆకర్షణీయంగా ఉన్నాయి. 34 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్, 791 మి.మీ సీటు ఎత్తు రైడర్ సౌకర్యాన్ని పెంచుతాయి. ఈ స్కూటర్ యువత, స్పీడ్ ఔత్సాహికులను ఆకర్షిస్తుంది

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad