OnePlus Pad Lite Launched: బడ్జెట్ ధరలో స్టైలిష్ ప్యాడ్ కొనాలని ఆలోచిస్తున్నారా..? వన్ ప్లస్ బడ్జెట్ ధరలో కొత్త టాబ్లెట్ ను రిలీజ్ చేసింది. కంపెనీ వన్ ప్లస్ ప్యాడ్ లైట్ పేరిట దీని భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఇది శక్తివంతమైన 9340mAh బిగ్ బ్యాటరీతో రావడం విశేషం. అయితే, ఇప్పుడు ఈ టాబ్లెట్ కు సంబంధించి ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
OnePlus Pad Lite ధర:
వన్ ప్లస్ ప్యాడ్ లైట్ భారతదేశంలో ఏరో బ్లూ కలర్ ఆప్షన్‌లో లభిస్తోంది. ఈ టాబ్లెట్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 6GB RAM + 128GB స్టోరేజ్ (Wi-Fi) వేరియంట్ ధర రూ.12,999గా, 8GB RAM + 128GB స్టోరేజ్ (Wi-Fi + 4G LTE) వేరియంట్ ధర రూ.14,999గా నిర్ణయించారు. ఈ ధరలలో వరుసగా రూ.2,000, రూ.1,000 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఎంపిక చేసిన బ్యాంకులతో 6 నెలల వరకు నో-కాస్ట్ EMIని ఎంచుకునే అవకాశం కూడా ఉంది.
వన్ ప్లస్ ప్యాడ్ లైట్ టాబ్లెట్ ఆగస్టు 1న మధ్యాహ్నం 12 గంటల నుండి సేల్స్ కు అందుబాటులో ఉంటాయి. ఈ టాబ్లెట్ OnePlus.in, OnePlus స్టోర్ యాప్, వన్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది.
Also Read: Asus Vivobook 14 : Asus Vivobook 14 లాంచ్..ఏకంగా 29 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్..
OnePlus Pad Lite ఫీచర్లు:
వన్ ప్లస్ ప్యాడ్ లైట్ 1920 x 1200 పిక్సెల్‌ల రిజల్యూషన్, 16:10 యాస్పెక్ట్ రేషియో, 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇచ్చే 11-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. కాగా ఈ టాబ్లెట్ స్క్రీన్ 10-బిట్ కలర్, 500 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. టాబ్లెట్ అధిక-రిజల్యూషన్ ఆడియో కోసం సర్టిఫైడ్ క్వాడ్-స్పీకర్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
ఇది మీడియాటెక్ హీలియో G100 ప్రాసెసర్‌పై నడుస్తుంది. 9,340mAh బిగ్ బ్యాటరీతో వస్తున్న ఈ టాబ్లెట్ 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జర్‌తో ఛార్జ్ చేయవచ్చు. అయితే, దీని రిటైల్ ప్యాకేజీలో 15W ఛార్జర్ చేర్చారు. టాబ్లెట్‌లో 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5-మెగాపిక్సెల్ వెనుక కెమెరా ఉంది.
ప్యాడ్ లైట్ ఆక్సిజన్ OS 15.0.1 ఆధారంగా Android 15లో నడుస్తుంది. ఇది స్క్రీన్ మిర్రరింగ్, క్లిప్‌బోర్డ్ షేరింగ్, వన్ ప్లస్ ఫోన్‌లతో షేర్డ్ గ్యాలరీలు వంటి ఫీచర్లకు మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా ఇది Android కోసం క్విక్ షేర్, iOS, iPadOS పరికరాల కోసం O+ కనెక్ట్‌ను కూడా అందిస్తుంది. టాబ్లెట్‌లో Wi-Fi, బ్లూటూత్ 5.2, USB-C, ఫేస్ అన్‌లాక్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. కానీ, దీనికి సెల్యులార్ కనెక్టివిటీ సపోర్ట్ మాత్రం లేదు. ప్యాడ్ లైట్ 7.39mm మందం. 530 గ్రాముల బరువు.


