Oppo Reno 14FS 5G Leaks: ఒప్పో రెనో సిరీస్‌లో కొత్త ఫోన్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఒప్పో రెనో 14FS 5G అభివృద్ధి దశలో ఉందని, రాబోయే వారాల్లో లాంచ్ కావచ్చు అని ఒక నివేదిక పేర్కొంది. కొత్త రెనో సిరీస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వనప్పటికీ, ఒప్పో రెనో 14FS 5G గత నెలలో లాంచ్ అయిన రెనో 14F మోడల్ కంటే మెరుగైన స్పెక్స్‌తో వస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, డిజైన్, అంచనా ధర ఆన్‌లైన్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
Oppo Reno 14FS 5G ధర, లాంచ్ టైమ్‌లైన్:
Ytechb నివేదిక ప్రకారం.. ఒప్పో రెనో 14FS 5G ఫోన్ లూమినస్ గ్రీన్, ఓపెన్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ కాబోతోంది. దీనిని 12GB RAM, 512GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో తీసుకురావొచ్చు. ఇది జూన్‌లో మార్కెట్లో విడుదల అయినా Reno 14F 5G ను పోలి ఉంటుందని సమాచారం. ఇదే సమయంలో ఒప్పో రెనో 14FS 5G యూరప్‌లో EUR 450 (సుమారు రూ. 45,700) ధరకు లభిస్తుందని, ఈ ఏడాదిలోనే జూలై చివరిలో లేదా ఆగస్టు ప్రారంభంలో దీనిని లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది.
Also Read: OPPO Reno 14 5G Mint Green variant: ఒప్పో రెనో 14 5G న్యూ వేరియంట్ లాంచ్..
Oppo Reno 14FS 5G స్పెసిఫికేషన్లు:
లీకైన వివరాల ప్రకారం..ఒప్పో రెనో 14FS 5G పరికరం 6.57-అంగుళాల AMOLED స్క్రీన్‌ను పొందవచ్చు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తోంది. అదేవిధంగా ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేసే కలర్‌ఓఎస్ 15.0.2 ఉంటదని సమాచారం.
ఇక ఫోటోలు, వీడియోల కోసం..ఈ రాబోయే ఫోన్‌లో సోనీ IMX882 సెన్సార్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఉండవచ్చు. దీనితో పాటు, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరా కూడా ఉండవచ్చు. ఈ ఫోన్‌లో అనేక AI- ఆధారిత ఇమేజ్ ఎడిటింగ్ ఫీచర్లు, అలాగే గూగుల్ సర్కిల్ టు సెర్చ్, జెమిని AI అసిస్టెంట్‌కు మద్దతు ఇస్తుంది.
ఒప్పో రెనో 14FS 5G 45W ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ IP69 రేటింగ్‌తో వస్తుంది. దీని పరిమాణం 158.16×74.9×7.7mm. బరువు 181 గ్రాములు ఉంటుంది.


