Realme 15T 5G Launched: ప్రముఖ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశ మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ దీని రియల్‌మీ 15T పేరిట తీసుకొచ్చింది. ప్రత్యేక విషయం ఏంటంటే? 7000mAh బిగ్ బ్యాటరీతో వస్తోన్న ఈ పరికరం బడ్జెట్ ధరలో ఉండటం విశేషం.ఇందులో 50MP ఫ్రంట్ కెమెరా, 6.57 అంగుళాల FHD+, మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ 5G చిప్‌సెట్, IP66/68/69 వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు దీని ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
Realme 15T 5G : ధర,ఆఫర్
కంపెనీ రియల్‌మీ 15T స్మార్ట్ ఫోన్ 8GBర్యామ్+128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,999గా పేర్కొంది. అదేవిధంగా 8GBర్యామ్+ 256 GB స్టోరేజ్ వేరియంట్ రూ.22,999గా, 12GBర్యామ్+256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999 కు అందుబాటులో ఉంచింది. కాగా, ఈ ఫోన్ ఫ్లోయింగ్ సిల్వర్, సిల్క్ బ్లూ, సూట్ టైటానియం షేడ్స్‌లో లభిస్తోంది. ఈ పరికరం సేల్స్ సెప్టెంబర్ 5 నుండి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ ఇండియా ఈ-స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల నుండి ప్రారంభమవుతుంది.
ఈ ఫోన్ పై రూ. 1000 తగ్గింపు లభిస్తుంది. ఇక ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో EMI ద్వారా ఫోన్‌ను కొనుగోలు చేస్తే వినియోగదారులు రూ. 2000 తగ్గింపు పొందవచ్చు. ఇక ప్రత్యేక విషయం ఏంటంటే? ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రీ-బుకింగ్ చేసుకుంటే వినియోగదారులు రియల్‌మీ బడ్స్ T01 TWS ఇయర్‌ఫోన్‌లను ఉచితంగా పొందొచ్చు.
Realme 15T 5G: ఫీచర్లు
ఈ స్మార్ట్‌ఫోన్ 6.57 అంగుళాల (2372 x 1080 పిక్సెల్‌లు) ఫుల్‌హెచ్‌డి + 120Hz OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 4000 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశాన్ని సపోర్ట్ చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ లో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 మ్యాక్స్ 6nm ప్రాసెసర్‌ను అమర్చారు. ఫోన్‌లో ఆర్మ్ మాలి-G57 MC2 GPU ఉంది. ఈ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ 8GB/12GB RAMతో, 128GB/256GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఆప్షన్‌ను కలిగి ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2 TB వరకు విస్తరించవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ UI 6.0 తో వస్తుంది.
కెమెరా విషయానికి వస్తే, ఈ స్మార్ట్‌ఫోన్‌లో F/1.8 అపెర్చర్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో F/2.2 అపెర్చర్‌తో 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం.. ఫోన్‌లో F/2.4 అపెర్చర్‌తో 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ రియల్‌మీ హ్యాండ్‌సెట్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ ఉన్నాయి. బ్యాటరీ గురించి మాట్లాడితే, ఫోన్‌ను పవర్ చేయడానికి 7000mAh బిగ్ బ్యాటరీ అందించారు. ఇది 60W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ హైబ్రిడ్ డ్యూయల్ సిమ్‌కు మద్దతు ఇస్తుంది.
కనెక్టివిటీ పరంగా, ఇందులో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6 802.11 AX, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C 2.0 వంటి ఫీచర్లు ఉన్నాయి. డస్ట్-వాటర్ రెసిస్టెంట్ కోసం ఈ ఫోన్ IP66 + IP68 + IP69 రేటింగ్‌లతో వస్తుంది. పరికరం కొలతలు 158.36×75.19×7.79mm. బరువు 181 గ్రాములు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో USB టైప్-C ఆడియో, స్టీరియో స్పీకర్లు, హై-రెస్ ఆడియో కూడా ఉన్నాయి.


