Sunday, November 16, 2025
Homeటెక్నాలజీSamsung Galaxy A17 5G: 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీతో శామ్సంగ్ కొత్త ఫోన్..

Samsung Galaxy A17 5G: 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీతో శామ్సంగ్ కొత్త ఫోన్..

Samsung Galaxy A17 5G Launched: శామ్సంగ్ తమ వినియోగదారుల కోసం మరో కొత్త పరికరాన్ని మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ దీని శామ్సంగ్ గెలాక్సీ A17 5G పేరిట తీసుకొచ్చింది. బలమైన పనితీరు, గొప్ప కెమెరా, బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ లైఫ్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇది బడ్జెట్ ధరలో ఉండడం విశేషం. ఈ క్రమంలో ఈ ఫోన్ కు సంబంధించి ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

- Advertisement -

Samsung Galaxy A17 5G ధర:

కంపెనీ శామ్సంగ్ గెలాక్సీ A17 5G పరికరాన్ని ఎంపిక చేసిన మార్కెట్లలో పరిచయం చేసింది. యూరప్‌లో దీని 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర EUR 239 అంటే (సుమారు ₹24,000)గాపేర్కొంది. 6GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో కూడా త్వరలో లాంచ్ అవుతుందని సమాచారం.

Samsung Galaxy A17 5G ఫీచర్లు:

ఈ మొబైల్ 6.7-అంగుళాల పూర్తి HD + (1080 x 2340 పిక్సెల్‌లు) ఇన్ఫినిటీ-U సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఫోన్‌లో 5nm ఎక్సినోస్1330 ఆక్టా-కోర్ చిప్‌సెట్ ఉంది. ఇది Mali-G68 MP2 GPUతో జతచేయబడింది. ఈ ఫోన్ 8GB వరకు RAM, 256GB వరకు స్టోరేజ్‌తో వస్తుంది. భద్రత కోసం..సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. డ్యూయల్-సిమ్ (నానో + నానో) Samsung Galaxy A17 5G స్మార్ట్‌ఫోన్ Android 15 ఆధారంగా One UI 7పై నడుస్తుంది.

Also read: Lenovo: మార్కెట్లోకి AI ఫీచర్లతో లెనోవా కొత్త టాబ్లెట్.. ధర కేవలం రూ.16999 మాత్రమే!

ఇక ఫోటోగ్రఫీ కోసం..వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా (f/1.8 ఎపర్చరు, ఆటోఫోకస్‌తో) + 2MP మాక్రో కెమెరా (f/2.2) ఉంది. ఇదే సమయంలో ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా (f/2.0) అందుబాటులో ఉంది. కనెక్టివిటీ కోసం..ఈ పరికరం 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 5, బ్లూటూత్ 5.3, USB టైప్-C పోర్ట్‌ను కలిగి ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే…ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీని పరిమాణం 164.4 x 77.9 x 7.5mm. బరువు 192 గ్రాములు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad