Smart Phones: మోటరోలా లేదా శామ్‌సంగ్ వంటి బ్రాండ్ స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారా?.. అయితే ఈ కధనం మీకోసమే! ఈ రెండు కంపెనీల రెండు ప్రసిద్ధ ఫోన్‌లు లాంచ్ ధర కంటే చాలా చౌకగా కస్టమర్ల అంధుబాటులో ఉన్నాయి. అవి మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్, శామ్‌సంగ్ గెలాక్సీ A55 5G. ఆఫర్ లో భాగంగా ఈ రెండు పరికరాలు ఇప్పుడు అమెజాన్ ఇండియాలో లాంచ్ ధర కంటే రూ. 13 వేల వరకు చౌకగా ఉన్నాయి. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్లపై అనేక గొప్ప ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్న ఈ ఫోన్‌లపై ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందొచ్చు.కాకపోతే, పాత ఫోన్, బ్రాండ్, కండిషన్ స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఇపుడు ఈ ఫోన్ల పై ఉన్న ఆఫర్లు, ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Samsung Galaxy A55 5G
శామ్‌సంగ్ గెలాక్సీ A55 5G స్మార్ట్ లాంచ్ సమయంలో 8GBRAM+128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర రూ. 39,999. ఆఫర్ లో భాగంగా ఇప్పుడు ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో రూ.26,999 ధరతో లిస్ట్ చేయబడింది. అంతేకాదు, కంపెనీ ఈ ఫోన్ పై రూ.1349 వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. కస్టమర్లు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో ఈ ఫోన్ ధరను రూ.25,100 వరకు తగ్గించవచ్చు.
ఇక ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఈ ఫోన్‌లో 6.6-అంగుళాల ఫుల్ HD + డిస్‌ప్లేను పొందొచ్చు. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఎక్సినోస్ 1480 ప్రాసెసర్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో 25-వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
Also Read: Smart Phones: రూ.6500 ధరతో ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్ కొనాలా..? లిస్ట్ ఇదే..
Motorola Edge 50 Fusion 5G
లాంచ్ సమయంలో ఈ ఫోన్ 8GB RAM+128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999. ఇప్పుడు ఈ వేరియంట్ (హాట్ పింక్ కలర్) అమెజాన్ ఇండియాలో రూ.18,934కి అందుబాటులో ఉంది. అంటే, ఈ ఫోన్ దాని లాంచ్ ధర కంటే దాదాపు నాలుగు వేల రూపాయలు చౌకగా మారింది. ఫోన్‌పై రూ.750 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. కంపెనీ ఫోన్‌పై రూ.946 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.17900 వరకు ప్రయోజనాన్ని పొందవచ్చు.
ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఈ ఫోన్ 6.7-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్ ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్‌లు. సెల్ఫీల కోసం, కంపెనీ 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. ఫోన్‌లో అందించిన 5000mAh బ్యాటరీ 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2లో పనిచేస్తుంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.


