Sunday, November 16, 2025
Homeటెక్నాలజీTecno Pop 9 5G: రూ.7999కే టోక్నో 5జీ ఫోన్..కొనడానికి ఇదే మంచి ఛాన్స్!

Tecno Pop 9 5G: రూ.7999కే టోక్నో 5జీ ఫోన్..కొనడానికి ఇదే మంచి ఛాన్స్!

Tecno Pop 9 5G SmartPhone: కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?అయితే మీకో గుడ్ న్యూస్! సోని AI కెమెరాతో వస్తోన్న స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు బడ్జెట్‌ ధరలో అందుబాటులో ఉంది. అదే టెక్నో పాప్ 9 5G స్మార్ట్ ఫోన్. కంపెనీ ఈ ఫోన్‌లో 48-మెగాపిక్సెల్ సోనీ AI ప్రధాన కెమెరా అందించింది. 4GB ర్యామ్(వర్చువల్ RAMతో 8GB), 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ ధర , ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

- Advertisement -

ధర, ఆఫర్:
ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో ఎటువంటి ఆఫర్ లేకుండా రూ.7999 ధరతో లిస్ట్ అయింది. ప్రత్యేకత ఏమిటంటే సెప్టెంబర్ 10 వరకు ఫోన్‌పై రూ.500 తక్షణ ఫ్లాట్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఈ ఫోన్‌ను రూ.399 వరకు క్యాష్‌బ్యాక్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు. ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే డిస్కౌంట్ పాత ఫోన్ కండిషన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.

Also read: AI+ Smartphones: 50MP AI కేమెరా, 5000mAh బ్యాటరీతో కేవలం రూ.4,999కే AI+ స్మార్ట్ ఫోన్స్..

ఫీచర్లు:

కంపెనీ ఈ ఫోన్‌లో 6.6-అంగుళాల HD+ డిస్‌ప్లేను అందిస్తోంది. ఫోన్‌లో అందించే ఈ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 120Hz. ఈ టెక్నో ఫోన్ 4GB ర్యామ్, 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. ఫోన్‌లో 4GB వర్చువల్ RAM కూడా ఉంది. ఇది దాని మొత్తం ర్యామ్ ని 8GB వరకు పెంచుతుంది. ప్రాసెసర్‌గా ఫోన్‌లో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ఉంది.

ఫోటోగ్రఫీ కోసం, ఈ ఫోన్‌లో డ్యూయల్ LEDతో 48-మెగాపిక్సెల్ సోనీ IMX582 సెన్సార్‌ను పొందొచ్చు. దీనితో పాటు కంపెనీ ఫోన్‌లో సెకండరీ AI లెన్స్‌ను కూడా అందిస్తోంది. ఇది సెల్ఫీల కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఫోన్‌లో 5000mAh బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

ఈ ఫోన్‌లో బయోమెట్రిక్ భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను చూడొచ్చు. శక్తివంతమైన ధ్వని కోసం, కంపెనీ ఈ ఫోన్‌లో స్టీరియో స్పీకర్లతో పాటు డాల్బీ అట్మోస్‌ను కూడా అందిస్తోంది. OS గురించి చెప్పాలంటే, ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా HiOS 14లో పనిచేస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad