Sunday, November 16, 2025
HomeTop StoriesHYDRA: ఖరీదైన ప్రభుత్వ భూమి కబ్జా.. రంగంలోకి దిగిన హైడ్రా.. కూల్చివేత!

HYDRA: ఖరీదైన ప్రభుత్వ భూమి కబ్జా.. రంగంలోకి దిగిన హైడ్రా.. కూల్చివేత!

HYDRA Demolition in Manikonda: హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా (HYDRA) అధికారుల చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మణికొండలోని పుప్పాల గూడలో కబ్జాకు గురైనా ప్రభుత్వ భూమిలోని ప్లాట్లను అధికారులు తొలగించారు. నెమలి నగర్‌లో దాదాపు 500 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన నిర్మించిన అక్రమ ప్లాట్లను గుర్తించి నేడు ఉదయం రెవెన్యూ, మున్సిపల్ అధికారులు భారీ బందోబస్తు మధ్య పూర్తిగా కూల్చివేశారు. అనంతరం ప్రభుత్వ అధికారులు ఆక్రమిత స్థలంలో ఇది ప్రభుత్వానికి చెందిన భూమి అని బోర్డు ఏర్పాటు చేశారు.

- Advertisement -

ఈ తరహా ఆక్రమణలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఏరియాల్లో భూముల ధరలకు రెక్కలు రావడం. ప్రభుత్వ భూములు ఎక్కువగా ఆక్రమణలకు గురి కావడంతో హైడ్రా సీరియస్‌గా దృష్టి సారించింది. ఈ శివారు ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటల శిఖం భూములను ఎక్కువగా రాజకీయ ప్రముఖులు, రియల్టర్లు, బిల్డర్లు అక్రమంగా ఆక్రమిస్తున్నారు. దీంతో నగరంలోని నాలాలు, రోడ్లు, పార్కులు, పుట్‌పాత్‌లను కూడా వదలకుండా ఆక్రమించడం ద్వారా ప్రకృతి విపత్తులు ఎక్కువగా సంభవించి భారీగా ఆస్తి నష్టం సంభవిస్తోంది.

ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు రెవెన్యూ, మున్సిపల్, హైడ్రా సంయుక్తంగా జియో-రిఫరెన్స్డ్ మ్యాప్స్‌, పాత రికార్డుల ఆధారంగా ప్రభుత్వ స్థలాలను రక్షించేందుకు న్యాయ పోరాటం సైతం చేస్తున్నాయి. ఈ ఆక్రమణలను ఆధీనం చేసుకోని పక్షంలో భారీ వర్షాల కారణంగా కాలనీలను వరదలు చుట్టేస్తాయని భావిస్తున్నారు. నగరంలోని ప్రభుత్వ భూములను ఆదుకోవడంలో భాగంగా భవిష్యత్తులో అధికార యంత్రాంగం మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad