Wednesday, April 2, 2025
Homeచిత్ర ప్రభAllu Arjun: అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్

Allu Arjun: అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్

అల్లు అర్జున్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.50వేల వ్యక్తిగత పూచికతతో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.. చంచల్‌గూడ జైలు సూపరిండెంట్‌కు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. సీనియర్ జర్నలిస్టు అర్నబ్ గోస్వామి తీర్పు ఆధారంగా అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.

- Advertisement -

అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో రెండు గంటల పాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. బన్నీ తరపు లాయర్ నిరంజన్ రెడ్డి తన వాదనలను స్ట్రాంగ్‌గా వినిపించారు. ఆయన వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. ఈ కేసులో పోలీసులు పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని కోర్టు పేర్కొంది.

కాగా తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను తన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన నివాసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు అనంతరం గాంధీ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ విభాగంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న కోర్టు బన్నీకి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో అల్లు అర్జున్‌ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం జైలులో ఉన్న బన్నీ.. హైకోర్టు తీర్పుతో బయటకు రానున్నారు. అయితే రాత్రి లోపు వస్తారా..? లేదంటే రేపు ఉదయం వస్తారా..? అనే దానిపై తేలాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News