ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వై. అంజయ్య యాదవ్ తన ఎన్నికల ప్రచారని విస్తృతంగా చేపడుతున్నారు. ఈ మేరకు కొందుర్గు మండల పరిధిలోని చిన్న ఎల్కిచర్ల గ్రామంలో ప్రసంగించిన అనంతరం వృద్ధులతో మాట కలిపారు. ఓ వృద్ధురాలితో ..పెద్దమ్మా నీ ఓటు ఎవరికి వేస్తావని ప్రశ్నించగా.. ఇంకెవరికి నాయనా కెసిఆర్ కే వేస్తానని అన్నారు.
నెలనెలకు పింఛన్ ఇస్తుండు.. అందరికీ అన్ని పథకాలు చేస్తున్నాడు.. అంతా మంచి చేసే సీఎంకే మా ఓటు అంటూ ఆ వృద్ధురాలు ఎమ్మెల్యేకు తెలిపారు. కుటుంబంలో పెద్దన్నగా కేసీఆర్ పాత్ర పోషిస్తున్నారని, కన్న కొడుకులు కూడా ఈ విధంగా చేయడం లేదని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే అనగా వృద్ధురాలు.. జై తెలంగాణ అంటూ నినదించడం విశేషం.