Monday, May 20, 2024
HomeతెలంగాణGodavarikhani: కార్పొరేట్ యజమానులు ప్రజా సేవకులు కాలేరు

Godavarikhani: కార్పొరేట్ యజమానులు ప్రజా సేవకులు కాలేరు

ప్రశ్నించే నాయకత్వానికి అండగా నిలబడాలి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ప్రజా సంక్షేమ పథకాలు విచిన్నమయ్యాయని పెద్దపల్లి టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. స్థానిక ఎల్బీనగర్, తిలక్ నగర్ సెంటర్ లలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లకు ఆయన హాజరై మాట్లాడారు. గత కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వాలు ఏనాడు కూడా తెలంగాణ ప్రాంతంపై మక్కువ చూపలేదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ఏర్పడ్డాక దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు ప్రణాళికబద్దంగా అమలు అయ్యాయి. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి హామీలతో అమాయక ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కింది.

- Advertisement -

ప్రతి ఆడపడుచుకు రూ.2500, పెంచదారలకు 4వేలు, రూ.500లకే గ్యాస్ కనెక్షన్, పంట సాగు బడికి రూ.15వేలు, ప్రతి ఆడపడుచు పెళ్లికి రూ. లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని నమ్మబలికి.. ఈనాటికి కూడా ఒక హామీని అమలు చేయక ప్రజలను మోసం చేసిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే విధంగా చేయాలంటే.. రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి కెసిఆర్ కు బలం చేకూర్చాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు ఓ అగర్బ శ్రీమంతునికి.. భూగర్భ కార్మికునికి జరుగుతున్న ఎన్నికలని ఆయన అభివర్ణించారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎక్కడో హైదరాబాదులో ఉండే అతను ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి వెళ్లే వ్యక్తి అని ఆయన అన్నారు. స్థానికునిగా.. సింగరేణి కార్మికునిగా.. కార్మిక సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఎన్నికల అవకాశం కల్పిస్తే ప్రజలకు అండగా నిలుస్తానని ఆయన అన్నారు. వెంకట స్వామి కుటుంబం అధికారం కోసమే తప్ప ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధి ఉండదని ఆయన అన్నారు. కాకా కుటుంబంలో చెన్నూరు ఎమ్మెల్యేగా, బెల్లంపల్లి ఎమ్మెల్యేగా సాగుతున్నారని.. అధికారం వ్యామోహంతో పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీకృష్ణ బరిలో ఉన్నారని ఆయన అన్నారు. ఈ ప్రాంతం బిడ్డగా మీ ఆశీర్వాదంతో ఉన్నత స్థాయికి ఎదిగానని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమం సజావుగా ఉండాలన్న ప్రశ్నించే నాయకత్వానికి అండగా నిలబడాలని ఆయన కోరారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడే మన హక్కులు సాధ్యమవుతాయని ఆయన అన్నారు.

ఈ మట్టిపై పుట్టిన బిడ్డగా సింగరేణి కార్మిక సమస్య తెలిసిన వ్యక్తిగా మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన అన్నారు. కార్మికులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. రాబోయే కాలంలో సింగరేణి సంస్థకు అతిపెద్ద ప్రమాదం పొంచి ఉన్నదని.. సింగరేణిని అమ్మడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఆయన అన్నారు. బిజెపి కాంగ్రెస్కు ఓటు వేస్తే రాష్ట్రానికి నష్టం తప్పదని ఆయన హెచ్చరించారు. ముందుగా పెద్దపల్లి ఎంపీ బి ఆర్ ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు కాలనీవాసులు ఘన స్వాగతం పలికారు. వేరు వేరుగా జరిగిన కార్యక్రమాలు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మనోడు.. సింగరేణి కార్మికుడు కొప్పులని గెలిపించుకుందాం: కోరుకంటి

ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా.. సింగరేణి కార్మికునిగా మృదు స్వభావి అయినటువంటి కొప్పుల ఈశ్వర్ ను పెద్దపెల్లి ఎంపీగా పెంచుకుందామని జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన విజృంభిస్తుందని.. ప్రభుత్వానికి చరమగితం పాడాలంటే రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో కెసిఆర్ ఆశీర్వదించి పెద్దపెల్లి పార్లమెంటు బిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మట్టిలో పుట్టిన వ్యక్తికి కార్మిక సమస్యలు తెలుస్తాయని అలాంటి వ్యక్తియే కొప్పుల ఈశ్వర్ అని కొనియాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు కావాలంటే కెసిఆర్ కు మద్దతుగా నిలిచి కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News