Sunday, July 7, 2024
HomeతెలంగాణPonnam Vs Bandi: బండిని అరెస్ట్ చేయాల్సిందే-పొన్నం మద్దతుదారులు

Ponnam Vs Bandi: బండిని అరెస్ట్ చేయాల్సిందే-పొన్నం మద్దతుదారులు

దిష్టిబొమ్మ దగ్ధం

రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ యొక్క దిష్టిబొమ్మను దగ్ధం కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కొండపాక మండల కమిటీ ఆధ్వర్యంలో వెలికట్ట ఎక్స్ రోడ్ వద్ద జరిగింది. ఈ సందర్భంగా కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాసరి లింగారావు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రజా సంకల్పయాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా యాత్రలు నిర్వహిస్తూ .. పొన్నం ప్రభాకర్ పైన బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు వాళ్ళ తల్లిని అవమానిస్తూ కించపరిచేలా మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.

- Advertisement -

అసభ్య పదజాలంతో దూషించిన బండి సంజయ్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మల్లికార్జున్, మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ చిన్న శ్రీను, అంకిరెడ్డిపల్లి గ్రామ అధ్యక్షుడు అంజయ్య, సీనియర్ నాయకులు గజవెల్లి సుదర్శన్, నూరోద్దీన్, సిద్ధులు, కొమురయ్య , దుద్దెడ గ్రామ అధ్యక్షులు అఖిల్గా, మధు, ప్రతాప్ చందర్, శంభయ్య, కనకరావు, సంజు, సోషల్ మీడియా ప్రభాస్, నర్సింలు, మిల్క్ రాజు, ర్యగాళ్ల రాజు, దేశాయిరెడ్డి, ఇస్మాయిల్, రమేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News