Saturday, November 15, 2025
HomeతెలంగాణBhadrachalam temple : భద్రాద్రిలో భక్తులు పెరిగినా.. ఆదాయం పతనం! రాముడి ఖజానాకు గండి కొడుతున్నదెవరు?

Bhadrachalam temple : భద్రాద్రిలో భక్తులు పెరిగినా.. ఆదాయం పతనం! రాముడి ఖజానాకు గండి కొడుతున్నదెవరు?

Bhadrachalam temple income decrease : భక్తుల రాకతో కిటకిటలాడుతోంది.. కానీ ఖజానా మాత్రం వెలవెలబోతోంది! దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఓ వింత పరిస్థితి నెలకొంది. గత ఏడాదితో పోలిస్తే, భక్తుల సంఖ్య దాదాపు రెండు లక్షలు పెరిగినా, ఆలయ ఆదాయం ఏకంగా రూ.7.40 కోట్లు తగ్గడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ వైరుధ్యానికి కారణమేంటి? భక్తుల కానుకలు ఏమవుతున్నాయి…? ఆలయ  నిర్వహణలో లోపాలున్నాయా…?

- Advertisement -

దిగ్భ్రాంతికరమైన గణాంకాలు : ఆలయ అధికారిక లెక్కల ప్రకారం, ఆదాయంలో భారీ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది.

భక్తుల పెరుగుదల: గత తొమ్మిది నెలల్లో 19.42 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 1.79 లక్షలు ఎక్కువ.

ఆదాయంలో భారీ కోత: అయితే, 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, 2024-25లో ఆలయ ఆదాయం ఏకంగా రూ.7.40 కోట్లు తగ్గింది.

నికర ఆదాయమూ పతనం: ఫిక్స్‌డ్ డిపాజిట్లను మినహాయించి, కేవలం నికర ఆదాయాన్ని పరిశీలించినా, రూ.1.40 కోట్ల మేర రాబడి తగ్గింది.

ఎక్కడ లోపం? కారణాలేంటి : భక్తుల రద్దీ పెరిగినా, ఆదాయం తగ్గడం వెనుక అనేక కారణాలున్నట్లు తెలుస్తోంది.

తగ్గిన హుండీ ఆదాయం: ప్రధాన ఆదాయ వనరైన హుండీల ద్వారా వచ్చే రాబడి తగ్గింది.
దుకాణాల రాబడిలో గండి: ఆలయానికి సంబంధించిన దుకాణాలు, భూముల లీజుల ద్వారా వచ్చే ఆదాయం కూడా ఆశించిన స్థాయిలో లేదు.

నిర్వహణా లోపాలు?: వసతి, ప్రసాదాల విక్రయాల ద్వారా రాబడి పెరిగినా, మొత్తం ఆదాయం తగ్గడం, నిర్వహణలో ఎక్కడో లోపం జరిగిందన్న అనుమానాలకు తావిస్తోంది.

అధికారుల స్పందన.. భవిష్యత్ కార్యాచరణ : ఈ పరిణామంపై స్పందించిన ఆలయ ఈఓ దామోదర్ రావు, ఆదాయం తగ్గిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే, భవిష్యత్తులో రాబడిని పెంచేందుకు పక్కా ప్రణాళికతో ఉన్నామని తెలిపారు.

ఈ ఏడాది భక్తుల రద్దీ దృష్ట్యా రాబడి పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు, త్వరలో కాశీయాత్ర చేపట్టి అక్కడ సీతారామ కల్యాణం నిర్వహిస్తాం. అన్నదానం సామర్థ్యాన్ని పెంచి, భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తాం. దేశవ్యాప్తంగా ఉన్న దాతలను భద్రాచలం తీసుకొచ్చి సన్మానిస్తాం.”
– దామోదర్ రావు, ఈఓ, భద్రాచలం రామాలయం

భక్తుల సూచనలు : ఆలయ రాబడిని పెంచేందుకు, భక్తులు, స్థానికులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆలయ ప్రాశస్త్యంపై ప్రచారాన్ని ఉధృతం చేయాలి. అనవసర ఖర్చులను నియంత్రించాలి. ఖాళీగా ఉన్న కీలక పోస్టులను భర్తీ చేయాలి.

ఉద్యోగులలో సమష్టి భావాన్ని పెంపొందించి, ఆలయ అభివృద్ధికి పాటుపడేలా చూడాలి.
భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న భద్రాద్రి ఆలయ ప్రతిష్ఠను కాపాడటంతో పాటు, దాని ఆర్థిక పరిపుష్టికి అధికారులు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad