Today Rains In TG: నేడు తెలంగాణ అంతటా 40-45 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే నేటి నుంచి మళ్ళీ మాన్ సూన్ కు బ్రేక్ పడుతుందని పేర్కొన్న అధికారులు.. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. ఇకపోతే నిన్నటి కంటే వర్షాలు చాలా వరకు తగ్గుముఖం పట్టీ.. రేపటి నుండి పూర్తిగా తగ్గుతాయన్నారు.
ఇక హైదరాబాద్ తో పాటు మిగతా అన్ని జిల్లాల్లో నేటి నుండి మళ్ళీ వర్షాలు తగ్గిపోతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. సాయంత్రం వరకు చినుకులు లేదా మేఘావృతమైన వాతావరణం మాత్రమే ఉంటుందన్నారు. సాయంత్రం తర్వాత కొద్దిసేపు వర్షం పడుతుందన్నారు. అయితే ఉదయమంతా మాత్రం పొడిగా ఉంటుందన్నారు.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/telangana-bc-reservation-ordinance-governor-suspense/
నేడు ఈ జిల్లాల్లో:
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డిలలో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి స్వల్ప వర్షపాతం నమోదవుతుందన్నారు.
గడిచిన 24 గంటల్లో:
గడిచిన 24 గంటల్లో హైదరాబాద్‌లో చినుకులు రాత్రంతా కొనసాగాయి. రంగారెడ్డి, యాదాద్రి – భోంగిర్, మహబూబ్‌నగర్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి. అలాగే నల్గొండ, సూర్యాపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్ కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి,ఖమ్మం, భద్రాద్రి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌లో రాత్రంతా మంచి వర్షాలు పడ్డాయి.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/ap-telangana-school-holidays-august-2025/
తెలంగాణలో గత 10 రోజుల పాటు విస్తారంగా కురుస్తున్న ముసురు రకం వర్షాలకు నేడు చివరి రోజని నిన్ననే అధికారులు తెలిపారు. జూలై 27 అనగా రేపటి నుండి వర్షపాతం మళ్ళీ గణనీయంగా తగ్గుముఖం పడనుందన్నారు. మళ్ళీ ఆగస్టు వరకు వర్షాలు అంతంత మాత్రమే కురిసే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో వర్షపు లోటు కొంతవరకు తీరినా.. ఇంకా తీరాల్సిన అవసరం చాలా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అభిప్రాయ పడింది. అల్పపీడనం కారణంగా ఇప్పటికీ రాష్ట్రంలోని వర్షపాతం మంచి స్థాయిలోనే ఉందని తెలిపింది. ఇకపోతే తెలంగాణలో జూన్ మొదటి వారంలోనే రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, వాటి ప్రభావం అంతగా లేదు.


