Sunday, July 7, 2024
HomeతెలంగాణChevella: కారు దిగి కాంగ్రెస్ లోకి..

Chevella: కారు దిగి కాంగ్రెస్ లోకి..

బీఆర్ఎస్ కంచుకోట ఖాళీ

చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇన్నాళ్లు కారు పార్టీలో ఉన్న ప్రజలు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండలంలోనే బిఆర్ఎస్ పార్టీకి మల్కాపూర్ గ్రామం కంచుకోట. కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ కంచుకోటను బదలు కొట్టింది. మల్కాపూర్ గ్రామంలో దాదాపు 200 మంది బీఆర్ఎస్ బిజెపి పార్టీ నాయకులు చింపుల సత్యనారాయణ రెడ్డి చేవెళ్ల ముడిమ్యాల చైర్మన్లు దేవర వెంకట్ రెడ్డి గోనె ప్రతాప్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు బండారు ఆగిరెడ్డి బక్క రెడ్డి యాదిరెడ్డి పిఎసిఎస్ డైరెక్టర్ శివరాజు చాకలి వెంకటేష్ అధ్వర్యంలో చెవిలో నియోజకవర్గ ఇన్చార్జి పామేన భీమ్ భరత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. భీమ్ భరత్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో చేవెళ్ల నియోజకవర్గంల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవ్వడం ఖాయమని, రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నచ్చి పెద్ద ఎత్తున పార్టీలోకి చేరుతున్నారని తెలిపారు. నాయకుల భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీతో ఉంటుందని నమ్మకంతో పార్టీలోకి పెద్ద ఎత్తున వస్తున్నారని చెప్పారు. గత టిఆర్ఎస్ పాలనలో ప్రజలు, ఆ పార్టీ కార్యకర్తలు పడ్డ ఇబ్బందులను తమకు చెప్పి బాధ పడుతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాదయ్య, వార్డు మెంబర్ అశోక్ గౌడ్, బైండ్ల శంకరయ్య, బక్క రెడ్డి మల్లారెడ్డి, బక్క రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సయ్యద్ ఉమర్,చామంతి జంగయ్య, కె యాదగిరి గౌడ్, రవీందర్ రెడ్డి, సిహె చ్ శ్రీశైలం, సిహెచ్ మల్లేష్, కే మల్లేష్ గౌడ్, ఎం మహేందర్ గౌడ్, ఎన్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News