Tuesday, November 26, 2024
HomeతెలంగాణKaushik Reddy: డ్రగ్స్ టెస్టుకు సిద్ధం.. కాంగ్రెస్ ఎంపీ సవాల్‌ స్వీకరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Kaushik Reddy: డ్రగ్స్ టెస్టుకు సిద్ధం.. కాంగ్రెస్ ఎంపీ సవాల్‌ స్వీకరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Kaushik Reddy| బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డ్రగ్స్ టెస్టులు నిర్వహించాలని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్(MP Anil Kumar Yadav) డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఎంపీ వ్యాఖ్యలపై హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) స్పందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం డ్రగ్స్ టెస్టుకు వస్తామని.. వరల్డ్ ఫేమస్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటామని.. వెంటనే ఆయన అపాయింట్మెంట్ తీసుకోండని సవాల్ విసిరారు. ఇవాళ రాత్రి 8 గంటల వరకు తాము ఎప్పుడైనా వస్తామని.. మీడియా ముందు డ్రగ్స్ టెస్టులు చేయించండని తెలిపారు. తమపై ఊరికే లేనిపోని విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ టెస్టుల ద్వారా.. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసుకుంటున్నారో లేదా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు డ్రగ్స్ తీసుకుంటున్నారో తేలుతుందన్నారు.

- Advertisement -

కాగా జన్వాడలో కేటీఆర్ బామర్దికి చెందిన రాజ్ పాకాల ఫాంహౌస్‌లో కేటీఆర్ కుటుంబసభ్యులు డ్రగ్స్ తీసుకున్నారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలను బీఆర్ఎస్ నేతలు గట్టిగా తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరికీ డ్రగ్స్ టెస్టులు చేయాలని రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు అనిల్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ బయట పడిన ప్రతిసారి గులాబీ నేతలు బయటికి వచ్చి మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు ఉంటే డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని అనిల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

రాజ్ పాకాల, విజయ్ మద్దూరిని వెనుకేసుకరావడానికి కేటీఆర్ కి సిగ్గు ఉండాలన్న ఆయన, కేటీఆర్‌కు అసలు బినామీ విజయ్ మద్దూరి అంటూ మరో బాంబు పేల్చారు. గత ప్రభుత్వం డ్రగ్స్ కేసుని ఏ విధంగా దారి మళ్లించారో ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేస్తుంటే బీఆర్ఎస్ డ్రగ్స్‌ని ప్రేరేపించాలని చూస్తున్నారని ఎంపీ భగ్గుమన్నారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం ఏమి చేయాలనుకుంటోందని ఆయన ప్రశ్నించటం విశేషం. స్వయంగా పోలీసుల ముందు రాజ్ పాకాల డ్రగ్స్ తనకు ఇచ్చినట్లు విజయ్ మద్దూరి ఒప్పుకున్నాడని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు స్టేట్మెంట్ మారుస్తున్నారని.. ఫామ్ హౌస్ దొర కేసీఆర్ డీజీపీకి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఈ కేసులో కేసీఆర్‌కు అంత పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముందని అనిల్ నిలదీశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News