Sunday, November 16, 2025
HomeతెలంగాణKavitha: కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం

Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం

Kavitha| ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయి బెయిల్‌పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) కొంతకాలంగా రాజకీయాల్లో సైలెంట్ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. .

- Advertisement -

“ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో నిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించిన విద్యార్థిని శైలజ కుటుంబ సభ్యులను ఓదార్చడానికి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) కోవా లక్ష్మీ, అనిల్ జాధవ్‌ను అడ్డుకోవడం దురదృష్టకరం. రాజ్యాంగ దినోత్సవం నాడే రాజ్యాంగ హక్కులకు (CM Revanth Reddy) రేవంత్ రెడ్డి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. నియంతృత్వ పోకడలకు రేవంత్ సర్కారు నిదర్శనం” అంటూ ఆమె మండిపడ్డారు. కాగా ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురైన వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ గత 20 రోజులుగా మృత్యువుతో పోరాడి కన్నుమూసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad