అలియాబాద్ దగ్గర రత్నాలయ మహాశివరాత్రి వేడుకలను ఘనంగా జరిపారు. ముఖ్య అతిథులుగా రాజయోగిని మంజు బి కే సత్యనారాయణ వైస్ ప్రెసిడెంట్ సురేష్ చంద్ర బెంజి రజక ఎగ్జిక్యూటివ్ నెంబర్ దీపక్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ అలోక్ బెంజి రక లాంకో గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ కొండలరావు జస్టిస్ ఈశ్వరయ్య మేధా సర్వో డ్రైవ్ లిమిటెడ్ కశ్యప్ డాక్టర్ గండయ్య మరియు బి కే లత మహాశివరాత్రి జయంతి సందర్భంగా శివుడికి దీపాలు ముట్టించి బి కే లత మాట్లాడుతూ మహాశివరాత్రి యొక్క ఆధ్యాత్మిక రహస్యము వారు తెలియజేశారు.
భారతదేశంలో తరతరాలుగా అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి ఒకటి శివునికి గుర్తుగా జ్యోతిర్లింగం చూపిస్తారు అంటే ఆయన విదేహి నిరాకార జ్యోతి మరియు పరమ పిత పరమాత్మ. ప్రజలు శివరాత్రి నాడు శివలింగాన్ని మారేడు దళాలతో జిల్లేడు పూలతో పాలతో అభిషేకిస్తూ పూజిస్తారు ఉపవాస వ్రతం జాగరణ ఆచరించడం లింగాష్టకం, బిల్వాష్టకములు మంత్రోచ్ఛారణలతో పూజిస్తూ పరమశివుని అనుగ్రహాన్ని పొందుటకు వారి స్మృతిలోనే గడుపుతారు.
శివ పరమాత్ముని ద్వారా లభించే అనంతమైన ప్రాప్తులను పొందుటకు శివ జయంతి మహోత్సవమునకు ప్రతి భక్తుడు తప్పకుండా ఆచరించాలి అని బికే లత గారు ప్రవచనం చెప్పారు