మందమర్రి పట్టణంలో “సోషల్ మీడియా అవగాహన సదస్సు” కార్యక్రమం నిర్వహించింది బీఆర్ఎస్ పార్టీ. ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరగటం విశేషం. బాల్క సుమన్ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలలోకి తీసుకెళ్లాలని, ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం ఇవ్వాలని ఈసందర్భంగా దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియాలో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం సోషల్ మీడియా మధ్యమంలో అన్నింటిలో పోస్ట్ చేయాలని సూచించారు. 24 వార్డుల సోషల్ మీడియా వారియర్స్ అధిక సంఖ్యలో తరలి వచ్చి ఈ శిబిరంలో పాల్గొన్నారు.