Sunday, July 7, 2024
HomeతెలంగాణChevella: ముదిరాజ్ సంఘ భనన్ ఏర్పాటు చేయాలి

Chevella: ముదిరాజ్ సంఘ భనన్ ఏర్పాటు చేయాలి

సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే యాదయ్య

చేవెళ్ల శాసనసభ నియజకవర్గ పరిధిలోని 5 మండలాలకు చెందిన ముదిరాజ్ సంఘ నాయకులు పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే కాలే యాదయ్యకు వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రంలో పొందుపరచిన పలు అంశాలపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చేవెళ్ల మండల కేంద్రంలో ముదిరాజు కులస్తులకు గాను స్థలాన్ని సమకూర్చి సొంత భవనాన్ని ఏర్పాటు చేసుకునేందుకు తోడ్పాటు నందించాలని సంఘ నాయకులు కోరగా కాలే యాదయ్య సానుకూలంగా స్పందిచారు. వీలయినంత త్వరగా స్థలాన్ని సమకూర్చితే పనులు త్వరగా పూర్తి అవుతాయని హామీ ఇవ్వడంతో సంఘ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మేల్యేను శాలువాలతో పుష్ప గుచ్చాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో చేవెళ్ల ముదిరాజ్ సంఘ నాయకులు ఉరెళ్ళ నరసింహ ముదిరాజ్, బంటు నారాయణ ముదిరాజ్, లింగం ముదిరాజ్, నరసింహ, జనార్ధన్, శ్రీరాములు ముదిరాజ్, నారాయణపురం మహేందర్ ముదిరాజ్, శ్రీనివాసులు ముదిరాజ్, గోపాల్, రమేష్ ముదిరాజ్, యాదయ్య ముదిరాజ్, పలు గ్రామాల ముదిరాజ్ సంఘ నాయకులు, కార్యక్రమంలో నియోజకవర్గంలోని 5 మండలాల ముదిరాజ్ సంఘ అధ్యక్షులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News