యువకులు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కాంగ్రెస్ నాయకుడు కావాలి వెంకటేష్ బాబు అన్నారు. మండల పరిధిలోని అంతారం గ్రామంలో ఏర్పాటు చేసిన కేవీబీ ప్రీమియర్ లీగ్ ను చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి ప్రారంభిచారు. అనంతరం వెంకటేష్ బాబు మాట్లాడుతూ… క్రీడల పట్ల ఆసక్తి అలవర్చుకొని శారీరక దారుద్యం మానసిక పరిపాకవాతతో ముందుకు సాగాలన్నారు. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడుతాయని, ఆటలు ఆడటం వల్ల చురుకుదనం, కలిసి సమాజంతో ఉండాలనే భావన పెరుగుతుందన్నారు. యువతలో నాయకత్వ లక్షణాలు అలవడుతాయన్నారు. టోర్నమెంట్లో భాగంగా మొదటి రోజు జరిగిన మ్యాచ్ లో అంతారం కౌకుంట్ల గ్రామాలు తలపడ్డాయి. టోర్నమెంట్ లో గెలిచిన టీమ్ కు మొదటి బహుమతి గా 20,000 ద్వితీయ బహుమతి 10,000 అందజేయనున్నట్లు ఆర్గనైజర్స్ తెలిపారు. కార్యక్రమంలో చాకలి సుధాకర్,జుట్టు సుధాకర్,గణపురం నరేందర్, చాకలి కుమార్,బండ సత్యనారాయణ,పాషా,మాదిగ నగేష్, అల్లి రవి కిషోర్, నాగారం ప్రవీణ్, లక్ష్మి నారాయణ అనంతయ్య,దయాకర్, బేగరి వీరాంజనేయులు, రాజు, ఆంజనేయులు, మణికంఠ, శ్రీనివాస్, నవీన్, భీమయ్య, అనిల్, భరత్ తదితరులు పాల్గొన్నారు.