చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి తను కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని నియోజకవర్గం సీనియర్ నాయకులు సున్నపు వసంతం తెలిపారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేషంలో వెల్లడిస్తూ….5 ఏండ్లు కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశానని కాంగ్రెస్ అధిష్టానం తన సేవలను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేవెళ్ల గడ్డపై పార్టీ తరపున ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలను నిలదీస్తూ…ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశానన్నారు. గడ్డు కాలంలో వేళ్లపై లెక్కించే కార్యకర్తలు నాయకులతో కలిసి చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ పార్టీని నిలబెట్టానన్నారు. చేవెళ్లలో వసంతం అంటే తెలియని ప్రజలు లేరన్నారు. ప్రజల తరఫున స్థానిక సమస్యలు అడుగంటిన అభివృద్ధిని నిలదీసేందుకు తనను నమ్మిన కార్యకర్తల సూచన మేరకు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని వెల్లడించారు. ఐదేళ్ల క్రితం ఈ ప్రాంత నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి అధికార పార్టీలోకి వెళ్లారని పార్టీపై అభిమానంతో పార్టీపై కార్యకర్తల అభిమానాన్ని చూసి పార్టీలో ఉంటూ వారికోసం సమస్యలపై తను ఒంటరిగా పోరాడానన్నారు. తను పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం కాదని తన సేవలను పార్టీ గుర్తించకపోవడంమే రెబల్ అభ్యర్థిగా మారుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, మైనార్టీ నాయకులు హనీఫ్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.