సమాజ గమనంలో వార్తా పత్రికల సేవలు ఎనలేనివని ఎస్ఆర్ నగర్ సీఐ పీవీ రాంప్రసాద్ అన్నారు. తెలుగుప్రభ ప్రతినిధి గోనెల కుమారస్వామి ఆయనకు తమ సంస్థ క్యాలెండర్, డైరీలను గురువారం మర్యాదపూర్వకంగా అందజేశారు. ఈ సందర్భంగా సీఐ రాంప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటం నుంచి నేటి వరకు ప్రజలు ప్రభుత్వం మధ్య పత్రికలు వారధిగా నిలుస్తున్నాయన్నారు. సమాజానికి మార్గదర్శనం చేయడంలో మేధావులకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు దేశ, విదేశాల్లో జరిగిన ఘటనలు, కార్యక్రమాల గురించి విశ్లేషణాత్మక కథనాలను అందిస్తూ వారికి విషయాలను చేరవేస్తున్నాయని చెప్పారు. తెలుగుప్రభ దినపత్రిక నిజాలను నిర్భయంగా, నిస్పక్షపాతంగా ప్రచురించడం అభినందనీయమన్నారు. పత్రికల్లో ఉండాల్సిన పారదర్శకత తెలుగుప్రభలో కనిపిస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రవిరాజ్,అఖిల తదితరులు పాల్గొన్నారు.
CI Ramprasad received Teluguprabha calendar: నిజాలు నిర్భయంగా, నిస్పక్షపాతంగా ప్రచురిస్తున్న తెలుగుప్రభ
తెలుగుప్రభలో పారదర్శికత కనిపిస్తోంది
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


