Sunday, November 16, 2025
HomeTop StoriesBIG BREAKING: బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక ఇప్పట్లో ఎన్నికలు లేనట్లే!

BIG BREAKING: బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక ఇప్పట్లో ఎన్నికలు లేనట్లే!

TG Govt Big decision on bc reservations: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారిన బీసీ రిజర్వేషన్ల అమలుపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 42 శాతం బీసీ రిజర్వేషన్లు లేకుండా.. పాతపద్ధతిలో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు చెప్పినప్పటికీ .. రాష్ట్ర ప్రభుత్వం 42 శాతంపై వెనక్కు తగ్గేలాలేదన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా.. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.

- Advertisement -

కొనసాగుతున్న సుదీర్ఘ చర్చలు: పాత రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లొచ్చని హైకోర్టు ఆర్డర్ కాపీ విడుదల చేసింది. తాజాగా హైకోర్టు జారీ చేసిన ఆర్డర్ కాపీపై రేవంత్ సర్కార్ సంఘం న్యాయనిపుణులతో చర్చిస్తోంది. బీసీ రిజర్వేషన్లపై విచారణ చేపట్టాలని కోరుతూ.. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. జీఓ9 అమలుకోసం భారత సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని అధికారులు, మంత్రులతో చర్చించిన అనంతరం సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీనిపై సుదీర్ఘ చర్చలు సాగుతున్నాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, మీనాక్షి నటరాజన్ లతో జూమ్ మీటింగ్ లో పాల్గొన్న సీఎం.. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

రాజ్యాంగ మౌలిక స్వరూపాల్లో భాగం: 42 శాతం బీసీ రిజర్వేషన్లపై రేవంత్ ప్రభుత్వం వెనక్కు తగ్గేలా కనిపించడంలేదు. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలనే నిర్ణయంతో .. స్థానిక సంస్థల ఎన్నికలకు మరింత సమయం పట్టేలా కనిపిస్తుంది. ఇలాంటి సున్నితమైన అంశంలో సర్వోన్నత న్యాయస్థానం ఆచితూచి అడుగులు వేస్తుంది. అందుకే ఇలాంటి అంశాన్ని విచారించే సందర్భంలో.. సుప్రీంకోర్టు దీర్ఘకాలిక సమయాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రిజర్వేషన్లు అనే అంశం రాజ్యాంగ మౌలిక స్వరూపాల్లో ఒకటిగా ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad