Sunday, November 16, 2025
HomeTop StoriesVC Sajjanar: మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్.. రెండు యూట్యూబ్ ఛానళ్లపై పోక్సో కేసు

VC Sajjanar: మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్.. రెండు యూట్యూబ్ ఛానళ్లపై పోక్సో కేసు

VC Sajjanar Concern On Minor content: మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్‌ చేస్తూ ఇంటర్వ్యూలు చేసిన పలు యూట్యూబ్‌ ఛానళ్లకు హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌.. ఇటీవల ‘X’ వేదికగా స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా రెండు యూట్యూబ్‌ ఛానళ్లపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ మేరకు ఈ విషయాన్ని సజ్జనార్‌ ‘ఎక్స్‌’ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా అభ్యంతరకర కంటెంట్లకు పాల్పడుతున్న పలు యూట్యూబ్ ఛానళ్లను ఆయన మరోసారి హెచ్చరించారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana-news/cm-revanth-reddy-distributed-group-2-appointment-letters/

‘సోషల్‌ మీడియాలో స్వేచ్ఛ ఉంది కదా అని ఏ తరహా కంటెంట్ అయినా సృష్టిస్తామంటే కుదరదు. చట్ట ప్రకారం బాధ్యులపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది.’ అని సజ్జనార్‌ స్పష్టం చేశారు. 

Also Read: https://teluguprabha.net/national-news/bihar-elections-nda-ljp-seema-singh-nomination-rejected/

వ్యూస్‌ మాయలో పడి విలువలను మరిచిపోకూడదని సీపీ సజ్జనార్ రెండు రోజుల క్రితం ఎక్స్‌ వేదికగా తెలిపారు. సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవ్వడం, వ్యూస్, లైక్‌ల కోసం చిన్నారుల భవిష్యత్తును పణంగా పెట్టడం సముచితం కాదని అన్నారు. చిన్నారులతో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. చిన్నారులకు, యువతకి స్పూర్తినిచ్చే, ఆదర్శంగా నిలిచే వ్యక్తులను ఇంటర్వ్యూలు చేసి.. సమజాభివృద్దికి దోహదం చేయాలని హితవు పలికారు. ఇలాంటి అసభ్యకరమైన వీడియోలు వారితో చేసి పిల్లలను పెడదోవ పట్టించొద్దని హెచ్చరించారు. చిన్నారులతో అసభ్యకరమైన కంటెంట్ రూపొందించడం పట్ల సజ్జనార్‌తో పాటు సినీ హీరో సాయ్‌ దుర్గా తేజ్‌ కూడా గత కొన్ని రోజులుగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad