Sunday, November 16, 2025
HomeతెలంగాణYadagiri Gutta: ఇష్ట దైవానికి ఇంటిని రాసిచ్చి భక్తుడు... ఇళ్లు విలువెంతో తెలిస్తే షాక్ అవ్వాస్సిందే!

Yadagiri Gutta: ఇష్ట దైవానికి ఇంటిని రాసిచ్చి భక్తుడు… ఇళ్లు విలువెంతో తెలిస్తే షాక్ అవ్వాస్సిందే!

Yadadri temple: సాధారణంగా మనం గుడికి వెళ్ళినప్పుడు కానుకగా ఏ పదో … పాతికో హుండీలో వేస్తాము. ఏదైనా కోరినప్పుడు… ఆ కోరిక నెరవేరితే దేవుడికి వెండి, బంగారు నగలను కానుకగా ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఇలా ఎవరి స్థాయికి తగ్గట్టు వారు దేవునికి తగిన కానుక సమర్పిస్తుంటారు. కానీ ఓ భక్తుడు తన ఇంటి ఇలవేల్పుకు ఏకంగా తన ఇంటినే రాసిచ్చిన ఘటన యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో చోటుచేసుకుంది.

- Advertisement -

భక్తుల పాలిట కొంగు బంగారం: తెలంగాణ తిరుపతిగా యాదగిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. పిలిస్తే పలికే దైవంగా భక్తులు భావిస్తుంటారు. కోరిన కోరికలు తీరిన తర్వాత భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. మరికొందరు విరాళాలు ఇస్తుంటారు. కానీ హైదరాబాద్ మహానగరం తిలక్ నగర్ కు చెందిన ముత్తినేని వెంకటేశ్వర్లు యాదాద్రి లక్ష్మీనరసింహుడికి ఏకంగా తన ఇంటినే రాసిచ్చాడు.

Also Read: https://teluguprabha.net/telangana-news/vikarabad-new-tourist-spot-weekend-getaway/

నరసన్న కరుణతో స్థిరపడ్డ పిల్లలు: ముత్తినేని వెంకటేశ్వర్లు ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించి రిటైర్డ్ అయ్యారు. ఉద్యోగిగా ఉన్న సమయంలోనే తిలక్ నగర్ లో సొంత ఇంటిని నిర్మించుకున్నారు వెంకటేశ్వర్లు. యాదగిరి నరసన్న కరుణతో వారి పిల్లలు ఆర్థికంగా స్థిరపడ్డారు. తాను కోరుకున్న కోరికలను నెరవేర్చిన స్వామివారికి ఏదైనా భారీ విరాళంగా ఇవ్వాలని వెంకటేశ్వర్లు భావించాడు. ఇందుకోసం తాను ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటినే స్వామి వారికి విరాళంగా రాసిచ్చాడు.

అక్షరాలా నాలుగు కోట్ల రూపాయలు: ఇంటి విలువ అక్షరాలా నాలుగు కోట్ల రూపాయల విలువ ఉంటుందని అన్నారు. చిక్కడపల్లిలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో యాదాద్రి దేవాలయం పేరిట రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇంటి రిజిస్ట్రేషన్‌ పత్రాలను యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో వెంకట్రావు సమక్షంలో దేవాలయ అధికారులకు అందజేశారు. దీంతో ఆ భక్తుడిని ఆలయ అధికారులు.. లక్ష్మినరసింహ స్వామి ప్రసాదం అందచేసి సన్మానించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad