జాతీయ కార్మిక సంఘాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో టీబీజీకేఎస్ కారుణ్య నియామకాల ద్వారా సాధించామని ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు అన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-5 గని ద్వారా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ప్రపంచంలో ఏ సంస్థలో లేని విధంగా కార్మికులు సమ్మె చేస్తే ఇంక్రిమెంట్లు, కోత ఉద్యోగాలు తీసేసేవారు అలాంటిది తెలంగాణ కొరకు సకల జనుల సమ్మెచేస్తే మన ముఖ్యమంత్రి వారందరికీ తెలంగాణ ఇంక్రిమెంట్ తో పాటు వారి సమ్మె కాలపు జీతం కూడా ఇప్పించిన ఘనత కేసిఆర్ కి దక్కుతుందన్నారు. 10 లక్షలు వడ్డీ లేని రుణం, ఏకరూప దుస్తులు, తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం, రైతుబంధు, దళిత బంధు, ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, ప్రతి గ్రామాల్లో స్మశాన వాటికలు, కాలేశ్వరం ప్రాజెక్టు లాంటివి అనేకమైన అభివృద్ధి పనులు తెలంగాణ రాష్ట్రం వచ్చినంక సాధించుకున్నామని తెలిపారు. ఇలాంటి అభివృద్ధి మునుముందు జరగాలంటే కెసిఆర్ వెంట ఉండి బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని, అలాగే ఈనెల 9న నస్పూర్ లో గల కలెక్టర్ కార్యాలయం ప్రక్కన జరగబోయే బహిరంగ సభకు అందరు రావాలని పిలుపునిచ్చినారు. అనంతరం ఆర్కే-5 క్యాంటిన్ లో కార్మికులకు అందిస్తున్న తినుబండారాల పరిశీలించి కార్మికులతో కలిసి అల్పాహారం చేశారు.
ఈ కార్యక్రమంలో టీబీజీకే కేంద్ర నాయకులు మంద మల్లారెడ్డి, డికొండ అన్నయ్య, పెట్టం లక్ష్మణ్, అశోక్, పానుగంటి సత్తయ్య, మున్సిపాలిటీ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, పార్టీ అధ్యక్షుడు అక్కురుసుబ్బయ్య మండల ఉపాధ్యక్షులు సంతోష్ చారి, కౌన్సిలర్లు, వంగ తిరుపతి, కమలాకర్ రావు జక్కుల రాజేశం మోతే కనకయ్య, పిట్ సెక్రెటరీ రామిడి మహేందర్ రెడ్డి నీలం సదయ్య శ్రీనివాసరావు నెలికి మల్లేష్ వర్క్ మెన్ ఇన్స్పెక్టర్లు శేఖర్ రావు చందాప్రవీణ్ రవికుమార్ రమేష్ శ్రీనివాస్ షరీఫ్ యూత్ లీడర్ చందుపట్ల సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.